Home / AP Politics
వచ్చే ఎన్నికల్లో వైకాపా నుంచి పోటీ చేయాలని తనకి లేదని ఆ పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇంటెలిజెన్స్ అధికారులు తనపై నిఘా పెట్టి ఫోన్ ట్యాప్ చేస్తున్నారంటూ గత రెండు రోజులుగా ఆరోపణలు చేస్తున్న ఆయన.. తాజాగా నెల్లూరులో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి పలు సంచలన వ్యాఖ్యలు చేశారు..
ఏపీలో అధికారంలో ఉన్న వైకాపా ఎమ్మెల్యే.. ఒక బ్యాంక్ మేనేజర్ తో కుమ్మక్కై 87 కోట్ల విలువైన ఆస్తుల్ని వేలంపాటలే బిడ్డర్లను భయపెట్టి 11 కోట్లకే సొంతం చేసుకున్నారంటూ సోషల్ మీడియా కోడై కూస్తుంది.
అధికార పార్టీ వైసీపీలో సొంత పార్టీ నేతల ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఫోన్ ట్యాపింగ్ గురించి సొంత పార్టీ నేతలే చేసిన ఆరోపణలు హాట్ టాపిక్ గా మారాయి. తమ ఫోన్లు ట్యాపింగ్ కు గురవుతున్నాయంటూ వైసీపీ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి బహిరంగంగా ఆరోపణలు చేస్తుండడం తెలిసిందే.
మూడు రాజధానుల అంశంపై ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై రేపు విచారణ జరగనుంది.2022 సెప్టెంబర్ 17వ తేదీన ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
అధికార వైసీపీ పార్టీలో సొంత నేతలే ఇప్పుడు రివర్స్ అవుతున్నారు. ఇప్పటికే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి ప్రశ్నించారని ఆయనను కాదని నియోజకవర్గ పార్టీ సమన్వయకర్తగా నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డిని ఇటీవలే నియమించారు.
Batchula Arjunudu : టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు ఈరోజు తెల్లవారుజామున తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే ఆయనను వారి కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. గుండెనొప్పిగా గుర్తించిన విజయవాడలోని రమేశ్ ఆసుపత్రిలో వైద్యులు ఆయనకు స్టంట్ వేశారు. ప్రస్తుతం బచ్చుల అర్జునుడికి బీపీ అధికంగా ఉండడంతో .. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. 24 గంటలు గడిచాక మరోసారి పరిస్థితిని సమీక్షించనున్నట్లు వివరించారు. బచ్చుల అర్జునుడు 2017లో శాసనసభ్యుల […]
మాజీ మంత్రి వట్టి వసంత కుమార్ (70) కన్నుమూతకిడ్నీ మార్పిడితో గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వసంత్ కుమార్అనారోగ్యంతో అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతూ కొద్ది సేపటిక్రితం మృతి చెందిన వసంత్వసంత్ స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా పూండ్ల గ్రామం
తారకరత్నకు గుండెపోటు వస్తే నారా లోకేష్ పట్టించుకోలేదని మంత్రి రోజా విమర్శించారు. టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్‌పై మంత్రి ఆర్కే రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. నారా లోకేష్ అడుగుపెడితే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయని రోజా కీలక కామెంట్స్ చేశారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు(Viveka Murder Case)లో సీబీఐ విచారణకు వైఎస్సార్సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి శనివారం హాజరు కానున్నారు.
మాజీమంత్రి, సీఎం జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురైన విషయం తెలిసిందే.ఈ కేసులో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్‌రెడ్డి నేడు సీబీఐ ముందు విచారణకు హాజరు కానున్నారు.హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు జరిగే విచారణకు హాజరు కానున్నారు.