Ycp MLA Kotamreddy : మూడు తరాలుగా వైఎస్ కుటుంబానికి సేవ చేస్తున్న.. చివరికి నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు : వైకాపా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి
అధికార వైసీపీ పార్టీలో సొంత నేతలే ఇప్పుడు రివర్స్ అవుతున్నారు. ఇప్పటికే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి ప్రశ్నించారని ఆయనను కాదని నియోజకవర్గ పార్టీ సమన్వయకర్తగా నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డిని ఇటీవలే నియమించారు.
Ycp MLA Kotamreddy : అధికార వైసీపీ పార్టీలో సొంత నేతలే ఇప్పుడు రివర్స్ అవుతున్నారు.
ఇప్పటికే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి ప్రశ్నించారని ఆయనను కాదని నియోజకవర్గ పార్టీ సమన్వయకర్తగా నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డిని ఇటీవలే నియమించారు.
ఇప్పుడు నెల్లూరు గ్రామీణ నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వంతు వచ్చినట్లుంది.
అధికార వైకాపా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తన ఫోన్‌ను ట్యాప్ చేస్తున్నారని స్వయంగా బయటపెట్టారు.
‘ముఖ్యమంత్రి, ఆయన కార్యాలయం నుంచి అనుమతి లేకుండానే అధికార పార్టీ ఎమ్మెల్యే ఫోన్‌ను పోలీసు అధికారులు ట్యాప్ చేయరు’ అని ఎమ్మెల్యే వర్గీయులు మండిపడ్డారు.
‘మా నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు అధికారులు నిధులివ్వడం లేదు. రూ.10 విలువ పని చేస్తే అర్ధ రూపాయీ విడుదల కావడం లేదు.
ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన బారాషహీద్ దర్గా ప్రాంతంలో మసీదు నిర్మాణానికీ డబ్బులివ్వలేదు.
ఇలాగైతే ప్రజలకేం సమాధానం చెప్పాలి?’ అంటూ ఇటీవల అధికారిక సమావేశంలోనే ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి అసహనం వ్యక్తం చేశారు.
‘3 నెలల నుంచి నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు.
ట్యాపింగ్ మొదలు పెట్టిన 1, 2 రోజుల్లోనే నాకు సమాచారం వచ్చింది’ అని శనివారం తనవద్దకు వచ్చిన ఇంటెలిజెన్స్ సిబ్బందితో ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి పేర్కొనడం ఆదివారం బయటకు వచ్చింది.
‘ప్రతిపక్షాలపై నిఘా పెట్టేందుకు పొలిటికల్ ఇంటెలిజెన్స్‌ను అధికారంలో ఉన్నవారు వాడతారు.
ప్రస్తుతం అధికార పార్టీ ఎమ్మెల్యేలపైనే నిఘా పెట్టడమేంటి?’ అని ఆయన వారితో అన్నట్లు సమాచారం.
తన డ్రైవరుతో మరో ఫోన్ తెప్పించి దానిని ఆ ఇంటెలిజెన్స్ సిబ్బందికి చూపిస్తూ.. ‘మీరు (పోలీసులు) ట్యాప్ చేస్తున్నారనే ఇలా మరో ఫోన్ వాడుతున్నా.
ఒకటి కాదు 12 రకాల సిమ్‌లు ఉపయోగిస్తున్నా. ఫేస్‌టైం, టెలిగ్రామ్ కాల్స్ అయితే ఏ సాఫ్ట్‌వేర్ ట్యాప్ చేయలేదు.
అవసరమైతే నా ఫోన్ ట్యాపింగ్ కోసం ప్రత్యేకంగా ఐపీఎస్ అధికారిని నియమించాలని మీ అధికారులకు చెప్పండి అని ఆయన వారితో సరదాగా అన్నట్లు సమాచారం.
వైఎస్ కుటుంబానికి మూడు తరాలుగా సేవ చేస్తున్న: ఎమ్మెల్యే కోటంరెడ్డి (Ycp MLA Kotamreddy)
అలానే రాజారెడ్డి, రాజశేఖరరెడ్డి, ఇప్పుడు జగన్ వరకూ మూడు తరాలకు సేవ చేస్తున్నా.
గతంలో జిల్లాలో ఆనం రామనారాయణరెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు ఆయనను ఎదుర్కొని మరీ జగన్ ఓదార్పు యాత్రను నిర్విఘ్నంగా పూర్తి చేయించగలిగా.
పార్టీ అధికారంలోకొచ్చాక మంత్రి పదవి, స్పీకర్, ఉపసభాపతి, చీఫ్‌విప్, విప్, చివరికి జిల్లా పార్టీ అధ్యక్ష పదవికీ అర్హుడిని కాకుండాపోయానా?’ అని ఎమ్మెల్యే తన సన్నిహితుల వద్ద వాపోతున్నారు.
నిజానికి ఆ సమావేశం జరిగే ప్రాంతానికి కొందరు ఇంటిలిజెన్స్ అధికారులు రావటంతో… కోటంరెడ్డి అసహనం వ్యక్తం చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
గత నెలలో కూడా అధికారులపై తీవ్రస్థాయిలో కామెంట్స్ చేశారు. గత నాలుగేళ్లుగా నియోజకవర్గంలో పనులు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
మంత్రులు మారుతున్నారు.. శాఖలు మారుతున్నాయి.. కలెక్టర్లు మారారు.. కానీ తన పనులు మాత్రం కావడం లేదని ఆక్రోశం వ్యక్తం చేశారు.
వరదలు వచ్చినా ఎఫ్‌డీఆర్ పనులు చేపట్టలేదని వ్యాఖ్యానించారు. ఫలితంగా 150 ఎకరాల పంట కొట్టుకుపోయిందన్నారు.. దీనికి ఎవరు బాధ్యులు అంటూ ప్రశ్నించారు.
బారాషాహిద్ దర్గాకు 10 కోట్లను ముఖ్యమంత్రి జగన్ మంజూరు చేసినా ఆర్థిక శాఖ కార్యదర్శి రావత్ అనుమతి ఇవ్వలేదన్నారు.
బీసీ భవన్ నిర్మాణ పనులు కూడా మిగిలిపోయాయి చెప్పుకొచ్చారు. నిధులు రాకపోవడంతో పనులు చేయలేమని కాంట్రాక్టర్లు చెబుతున్నారని… అసలు ఈ రావత్ ఎవరండీ అంటూ కామెంట్స్ చేశారు.
పొట్టేపాలెం వద్ద ఫ్లై ఓవర్ నిర్మాణానికి సంబంధించి ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదన్న కోటంరెడ్డి. దీనిపై అధికారుల్ని అడిగితే సరిగ్గా సమాధానం ఇవ్వడం లేదని ధ్వజమెత్తారు.
తాజాగా ఫోన్ ట్యాపింగ్ అంటూ కామెంట్స్ చేయటం కూడా హాట్ టాపిక్ మారింది.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/