Published On:

IPL 2025 : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్

IPL 2025 : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్

IPL 2025 : ఐపీఎల్ 18 సీజన్‌లో భాగంగా మరికాసేపట్లో లక్నో, ఢిల్లీ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలోనే టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ప్లే ఆఫ్స్ రేసు ఆస‌క్తిక‌రంగా మారుతున్న నేప‌థ్యంలో అక్ష‌ర్ బృందం ఏ మార్పులు లేకుండా బ‌రిలోకి దిగుతుంది. రిషభ్ పంత్ సేన పేస‌ర్ దుష్మంత్ స‌మీర‌కు తుది జ‌ట్టులో అవకాశం కల్పించింది. టేబుల్‌లో రెండో స్థానంలో ఉన్న ఢిల్లీకి, ఐదో స్థానంలో కొన‌సాగుతున్న ల‌క్నో నిలువ‌రిస్తుందా? లేదా చూడాలి. ఇప్ప‌టివ‌ర‌కూ ఇరుజట్లు ఆరు సార్లు త‌ల‌ప‌డ‌గా, చెరో మూడు ప‌ర్యాయాలు గెలుపొందాయి.

లక్నో జట్టు : మిచెల్, మార్క్రమ్, పూరన్, రిషభ్ పంత్, సమద్, మిల్లర్, దిగ్వేశ్, బిష్ణోయ్, ఆవేశ్, శార్దూల్, ప్రిన్స్ ఉన్నారు.

ఇంప్యాక్ట్ ప్లేయర్స్ : ఆయుష్ బ‌దొని, మ‌యాంక్ యాద‌వ్, ష‌హ‌బాజ్ అహ్మ‌ద్, మాథ్యూ బ్రీట్జ్, హిమ్మ‌త్ సింగ్ ఉన్నారు.

 

ఢిల్లీ జట్టు : పోరెల్, కరుణ్, కేఎల్ రాహుల్, అక్షర్, స్టబ్స్, అశుతోష్, విప్రజ్, స్టార్క్, దుష్మంత, ముకేశ్, కుల్దీప్ ఉన్నారు.

ఇంప్యాక్ట్ ప్లేయర్స్ : జేక్ ఫ్రేజ‌ర్ మెక్‌గుర్క్, సమీర్ రిజ్వీ, డొన‌వాన్ ఫెరారీ, మాధ‌వ్ తివారీ, త్రిపుర‌ణ విజ‌య్ ఉన్నారు.

ఇవి కూడా చదవండి: