Published On:

IPL 2025 : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్.. చావోరేవో పోరులో గెలుపు ఎవరిదో..!

IPL 2025 : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్.. చావోరేవో పోరులో గెలుపు ఎవరిదో..!

Sunrisers vs Chennai Super Kings, IPL 2025 43th Match : ఐపీఎల్ 18వ సీజన్‌లో భాగంగా ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు మరికాసేపట్లో తలపడనున్నాయి. ఈ క్రమంలోనే టాస్ గెలిచిన ఎస్‌ఆర్‌హెచ్ మొదటగా బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు తమ ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంటుంది. దీంతో ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలని రెండు జట్లు పట్టుదలతో ఉన్నాయి. ట‌ర్నింగ్ పిచ్‌తో స్వాగ‌తం ప‌లికే చెన్నై సూపర్ కింగ్స్‌ను ఎస్‌ఆర్‌హెచ్ టాపార్డ‌ర్ దెబ్బ‌కొడ‌తారా? లేదా నిల‌క‌డ‌లేమిని కొన‌సాగిస్తూ తోక ముడుస్తారా? అనేది చూడాలి. ఐపీఎల్‌లో రెండు జట్లు ఇప్ప‌టివ‌ర‌కు 22 సార్లు పోటీపడ్డాయి. చెన్నై ఆధిప‌త్యం చెలాయిస్తూ 16 విజయాలు సాధించింది. 18వ సీజ‌న్‌లో అదే జోరు చూపాలని కెప్టెన్ ధోనీ సేన భావిస్తోంది. ఈ మ్యాచ్‌ కోసం చెన్నై రెండు మార్పులు చేసింది. ర‌చిన్ ర‌వీంద్ర స్థానంలో డెవాల్డ్ బ్రెవిస్ ఆడుతాడు. విజ‌య్ శంక‌ర్ బ‌దులు దీప‌క్ హుడా జ‌ట్టులోకి వ‌చ్చాడు.

 

చెన్నై జట్టు : బ్రెవిస్, ఆయుష్, షేక్ రషీద్, దీపక్ హుడా, సామ్ కరన్, శివమ్ దూబె, ఎంఎస్ ధోనీ, రవీంద్ర జడేజా, నూర్, ఖలీల్, పతిరణ ఉన్నారు.

ఎస్ఆర్‌హెచ్ జట్టు : అభిషేక్, ఇషాన్, నితీశ్, క్లాసెన్, అనికేత్, మెండిస్, కమిన్స్, హర్షల్, ఉనద్కత్, జీషన్, షమి ఉన్నారు.

 

ఇవి కూడా చదవండి: