IPL 2025 : మిచెల్ మార్ష్, పూరన్ అర్ధశతకాలు.. ఢిల్లీ లక్ష్యం 210

IPL 2025 : 2025 ఐపీఎల్ 18వ సీజన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్ ముగిసింది. లఖ్‌నవూ బ్యాటర్లు నికోలస్ పూరన్ 30 బంతుల్లో 75 పరుగులు చేశాడు. మిచెల్ మార్ష్ 36 బంతుల్లో 72 అర్ధశతకంతో రాణించాడు. చివర్లలో డేవిడ్ మిల్లర్ 27 పరుగులు చేశాడు. దీంతో 20 ఓవర్లలో లఖ్‌నవూ 8 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో మిచెల్ స్టార్క్ 3, కుల్‌దీప్ యాదవ్ 2, విప్‌రాజ్ నిగమ్, ముకేశ్ కుమార్ చెరో వికెట్ తీశారు.