Home / పొలిటికల్ వార్తలు
ఏపీలో ఐఏఎస్ కన్ఫర్మేషన్ ప్రక్రియ ను ఆపాలని టీడీపీ అధినేత చంద్రబాబు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి లేఖ రాశారు. ఐఏఎస్ కన్ఫర్మేషన్ ప్రక్రియను వాయిదా వేయాలని కోరారు. ఐఏఎస్‌కు రాష్ట్ర కేడర్ కు చెందిన గ్రూప్ 1 ఆఫీసర్ల ను ఎంపిక చేస్తారు .
ఇండియాలో లీడింగ్ ఎయిర్‌లైన్ ఇండిగో మాతృ సంస్థ ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ మార్చితో ముగిసిన నాలుగవ త్రైమాసిక ఫలితాలను గురువారం నాడు వెల్లడించింది. ఏడాది ప్రాతిపదికన చూస్తే కంపెనీ ఏకీకృత నికరలాభం106 శాతం పెరిగి రూ.1,895కోట్లకు ఎగబాకింది.
ఏపీలో తాజాగా జరిగిన ఎన్నికల్లో పొత్తులో భాగంగా జనసేన పోటీచేసిన 21 స్థానాలు గెలవబోతున్నట్లు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు తెలిపారు . అన్ని సర్వేలు, మీడియా సంస్థల నివేదికలు కూటమి అధికారంలోకి రానున్నట్లు చెబుతున్నాయని.. ముఖ్యంగా జనసేన పోటీ చేసిన 21 కి 21 స్థానాల్లో గెలవబోతున్నట్లు సమాచారం ఉందని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె. నాగబాబు స్పష్టం చేశారు
రాష్ట్రం రావణకాష్ఠంలాగా మారుతుంటే ఇరుపార్టీల అగ్రనేతలు విదేశీ పర్యటనలు చేయడం ఏంటని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు .సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఏపీ తాజా రాజకీయ పరిణామాలపై స్పందించారు
సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ నేత ఈటల రాజేందర్ ఫైర్ అయ్యారు. ఆఫ్ట్రాల్ నువ్వేంత్ రేవంత్ రెడ్డి అంటూ మండిపడ్డారు. ప్రజలు ఆశీర్వదించి ఒక అవకాశం ఇస్తే.. నీకు ఆ పదవి వచ్చిందని ధ్వజమెత్తారు. పదవి నీ సొంతం కాదు, నీ జాగీరు కాదు.. అది ప్రజల హక్కు అని విమర్శించారు.
కాపుసంక్షేమ నేత ,సీనియర్ రాజకీయ వేత్త చేగొండి హరిరామ జోగయ్య ప్రధాని మోదీకి లేఖ రాసారు .గత కొంతకాలంగా ఏపీలో ఎన్డీయే కూటమి విజయాన్ని కాంక్షిస్తూ జనసేనాని పవన్ కళ్యాణ్ కు ,కూటమిలోని టీడీపీ కి సలహాలు ,సూచనలు చేస్తూ లేఖలు రాయడం తెలిసిందే.
భారతీయ జనతాపార్టీ అబ్ కీ బార్ 400 పార్ అంటూ ఎన్నికలకు ముందు ఈ నినాదం హోరెత్తించింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నుంచి అమిత్ షా వరకు దేశంలోని ప్రతి బీజేపీ కార్యకర్త అబ్ కీ బార్ 400 పార్ నినాదాన్ని తలెత్తుకున్నాడు. అయితే ప్రారంభంలో ఉన్న జోష్ ఇప్పుడు మాత్రం కనపడ్డం లేదు
ఎన్నికల్లో గెలవడానికి రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున తాయిలాలు ప్రకటించి ఓట్లు దండుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా దీనిపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఒక జాతీయ పత్రిక ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్నికల సందర్భంగా ఇచ్చే తాయిలాల గురించి పలు ప్రశ్నలు సంధించారు.
ఏపీలో ఎన్నికలు ముగిసిన తర్వాత.. ఒకవైపు తీవ్రమైన హింస చెలరేగిన విషయం తెలిసిందే. మరో వైపు అగ్రనేతలు మాత్రం యాత్రలకు బయలుదేరారు . ప్రధాన ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు సతీసమేతంగా తీర్థయాత్రలు చేస్తున్నారు. మహారాష్ట్ర లోని పుణ్య క్షేత్రాలను చుడుతున్నారు
ఏపీలో ఎన్నికల సందర్భంగా ,ఎన్నికల అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలపై రాష్ట్ర సీఎస్, డీజీపీల నుంచి వివరణ అందుకున్న కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది.పల్నాడు, తిరుపతి, అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు, గుంటూరు, నంద్యాల జిల్లాల్లో హింసాత్మక ఘటనలు జరిగిన సంగతి తెలిసిందే .