Home / పొలిటికల్ వార్తలు
కాపుసంక్షేమ నేత ,సీనియర్ రాజకీయ వేత్త చేగొండి హరిరామ జోగయ్య ప్రధాని మోదీకి లేఖ రాసారు .గత కొంతకాలంగా ఏపీలో ఎన్డీయే కూటమి విజయాన్ని కాంక్షిస్తూ జనసేనాని పవన్ కళ్యాణ్ కు ,కూటమిలోని టీడీపీ కి సలహాలు ,సూచనలు చేస్తూ లేఖలు రాయడం తెలిసిందే.
భారతీయ జనతాపార్టీ అబ్ కీ బార్ 400 పార్ అంటూ ఎన్నికలకు ముందు ఈ నినాదం హోరెత్తించింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నుంచి అమిత్ షా వరకు దేశంలోని ప్రతి బీజేపీ కార్యకర్త అబ్ కీ బార్ 400 పార్ నినాదాన్ని తలెత్తుకున్నాడు. అయితే ప్రారంభంలో ఉన్న జోష్ ఇప్పుడు మాత్రం కనపడ్డం లేదు
ఎన్నికల్లో గెలవడానికి రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున తాయిలాలు ప్రకటించి ఓట్లు దండుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా దీనిపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఒక జాతీయ పత్రిక ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్నికల సందర్భంగా ఇచ్చే తాయిలాల గురించి పలు ప్రశ్నలు సంధించారు.
ఏపీలో ఎన్నికలు ముగిసిన తర్వాత.. ఒకవైపు తీవ్రమైన హింస చెలరేగిన విషయం తెలిసిందే. మరో వైపు అగ్రనేతలు మాత్రం యాత్రలకు బయలుదేరారు . ప్రధాన ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు సతీసమేతంగా తీర్థయాత్రలు చేస్తున్నారు. మహారాష్ట్ర లోని పుణ్య క్షేత్రాలను చుడుతున్నారు
ఏపీలో ఎన్నికల సందర్భంగా ,ఎన్నికల అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలపై రాష్ట్ర సీఎస్, డీజీపీల నుంచి వివరణ అందుకున్న కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది.పల్నాడు, తిరుపతి, అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు, గుంటూరు, నంద్యాల జిల్లాల్లో హింసాత్మక ఘటనలు జరిగిన సంగతి తెలిసిందే .
ఆంధ్రప్రదేశ్ లో అక్కడడక్కడ చెదురుమదురు ఘటనలు మినహా ప్రస్తుతానికి ప్రశాంతంగానే పోలింగ్ జరిగింది. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా.. చూడని విధంగా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టడంతో రాజకీయ పార్టీలు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ, 25 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఓటు వేసేందుకు ఉదయమే జనం భారీగా తరలివచ్చారు. అధికార వైసీపీ కార్యకర్తలు దాడులతో భయాందోళన కలిగిస్తున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల హింసాత్మక ఘటనలు జరిగాయి
బీజేపీ మాదిరి కాంగ్రెస్కు సర్జికల్ దాడులు చేసే ధైర్యం లేదన్నారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. శనివారం వికారాబాద్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు అమిత్ షా . ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ బీజేపీకి ఓటేస్తే.. ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామన్నారు.
కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామన్నారు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ. కడప లో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన రాహుల్.. బీజేపీ కీ బీ టీం గా చంద్రబాబు, పవన్, జగన్ పనిచేస్తున్నారని రాహుల్ విమర్శించారు. ప్రత్యేక హోదా పై జగన్ ఏనాడు కేంద్రాన్ని ప్రశ్నించలేదన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ సీఎం జగన్ ను ,గన్నవరం వైసీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ ని తీవ్రంగా విమర్శించారు. కృష్ణా జిల్లా గన్నవరంలో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు. రాజకీయ రౌడీలను తుంగలో తొక్కేస్తామని హెచ్చరించారు.