Last Updated:

Etala Rajender: ఆఫ్ట్రాల్ నువ్వెంత రేవంత్ రెడ్డి ? ..సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డ ఈటల రాజేందర్

సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ నేత ఈటల రాజేందర్ ఫైర్ అయ్యారు. ఆఫ్ట్రాల్ నువ్వేంత్ రేవంత్ రెడ్డి అంటూ మండిపడ్డారు. ప్రజలు ఆశీర్వదించి ఒక అవకాశం ఇస్తే.. నీకు ఆ పదవి వచ్చిందని ధ్వజమెత్తారు. పదవి నీ సొంతం కాదు, నీ జాగీరు కాదు.. అది ప్రజల హక్కు అని విమర్శించారు.

Etala Rajender: ఆఫ్ట్రాల్ నువ్వెంత రేవంత్ రెడ్డి ? ..సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డ ఈటల రాజేందర్

Etala Rajender: సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ నేత ఈటల రాజేందర్ ఫైర్ అయ్యారు. ఆఫ్ట్రాల్ నువ్వెంత రేవంత్ రెడ్డి అంటూ మండిపడ్డారు. ప్రజలు ఆశీర్వదించి ఒక అవకాశం ఇస్తే.. నీకు ఆ పదవి వచ్చిందని ధ్వజమెత్తారు. పదవి నీ సొంతం కాదు, నీ జాగీరు కాదు.. అది ప్రజల హక్కు అని విమర్శించారు.

ప్రజలు దెబ్బ కొడితే.. మళ్లీ లేవలేరు..(Etala Rajender)

ప్రజలు దెబ్బ కొడితే.. మళ్లీ లేవలేరని.. అంతా కాలగర్భంలో కలసి పోతారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని రోజులు ఉంటుందో ఆ పార్టీ నేతలకే తెలియదని.. అందుకే అందినకాడికి దోచుకుని దాచుకుంటున్నారని విమర్శించారు. హైదరాబాులో ఫీజు కట్టకపోతే.. బిల్డింగ్ పర్మీషన్ రావడం లేదని మండిపడ్డారు. అతి తక్కువ టైంలో అతి ఎక్కువగా అక్రమంగా వసూళ్లు చేసిన వ్యక్తిగా రేవంత్ నిలిచిపోయారని ధ్వజమెత్తారు.మోడీ, అమిత్ షా స్వయానా ఆర్ఆర్ టాక్స్ గురించి చెప్పారంటే ఏం జరుగుతుందో అర్థం చేసుకోవాలి .కాంగ్రెస్ వాళ్లు ఆవురావురమని ఉణ్నారు.కాంగ్రెసోళ్లకు ఎప్పటివరకు ఉంటామో తెలీయదు.. అంతా సర్దుకొని పెట్టారు. హైదరాబాదులో బిల్డింగ్ పర్మిషన్ కు చదరపు అడుగుకి రూ. 75,000 వాళ్ళ ఫీజు కట్టకపోతే పర్మిషన్ ఇస్తలేరని ఆరోపించారు. మళ్ళీ పంటలు ఎండిపోయాయి.. మోటార్లు కాలిపోయాయి. మరలా ఇపుడు మామూలు వ్యవస్దలు వచ్చాయని అన్నారు. పదవి ప్రజల భిక్షఅని మరిచిపో యిన నాయకుడు కాలగర్భంలో కలిసిపోతాడని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యంలో నిజమైన హక్కుదారులు ప్రజలు మాత్రమేనని రాజేందర్ పేర్కొన్నారు.