Last Updated:

Kerala : శబరిమల ఆలయానికి 39 రోజుల్లో రూ.223 కోట్ల ఆదాయం..

ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల ఆలయానికి భారీగా ఆదాయం వస్తోంది. రెండేళ్ల కరోనా ఆంక్షల తర్వాత గుడిలోకి అయ్యప్ప భక్తులను పూర్తి స్థాయిలో అనుమతిస్తుండటంతో భారీగా తరలివస్తున్నారు.

Kerala : శబరిమల ఆలయానికి  39 రోజుల్లో రూ.223 కోట్ల ఆదాయం..

Kerala : ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల ఆలయానికి భారీగా ఆదాయం వస్తోంది. రెండేళ్ల కరోనా ఆంక్షల తర్వాత గుడిలోకి అయ్యప్ప భక్తులను పూర్తి స్థాయిలో అనుమతిస్తుండటంతో భారీగా తరలివస్తున్నారు. దీంతో 39రోజుల్లోనే ఏకంగా 223 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చింది. ఇంత పెద్ద స్థాయిలో గుడికి ఆదాయం రావటం ఇదే ఫస్ట్ టైం అంటున్నారు ఆలయ అధికారులు. స్వామి దర్శనానికి చిన్నారులు అధిక సంఖ్యలో వస్తున్నారని తెలిపారు.

గత నెల 17న మండల పూజలు ప్రారంభం కాగా…అప్పటి నుంచి పెద్ద సంఖ్యలో అయ్యప్ప దర్శనానికి భక్తులు పోటెత్తారు. దాదాపు 30 లక్షల మంది భక్తులు శబరిమలను దర్శించుకున్నారు. అందులో ఐదో వంతు చిన్నారులే ఉన్నారని తెలిపారు. మరోవైపు 39 రోజుల్లో 223 కోట్ల ఆదాయం రాగా ఇందులో భక్తులు నేరుగా సమర్పించింది 70 కోట్ల 15 లక్షల రూపాయలని ట్రావెన్కోర్ దేవస్థాన బోర్డు అధ్యక్షుడు అనంతగోపన్ తెలిపారు.

కరోనాతో గత రెండేళ్లల నుంచి భక్తుల సంఖ్యపై పరిమితి విధించటంతో…శబరిమల అయ్యప్ప ఆలయానికి ఆదాయం తగ్గిపోయింది. ఈ ఏడాది కరోనా ఆంక్షలు సడలించటంతో ఎప్పుడు లేనంతగా భక్తులు పోటెత్తారు. ఆలయానికి వచ్చిన ఆదాయంలో మూడొంతులు ఉత్సవాల నిర్వహణకే వినియోగిస్తామని ట్రావెన్కోర్ దేవస్థాన బోర్డు తెలిపింది. స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టామన్నారు. ఆన్ లైన్, స్లాట్ బుకింగ్ తో పాటు సన్నిధానానికి వెళ్లేందుకు నాలుగు ద్వారాలు తెరిచినట్లు గోపన్‌ పేర్కొన్నారు.

నవంబర్ 17న ప్రారంభమైన మండల పూజలు నేటితో ముగియనున్నాయి. స్వామి వారికి ఇవాళ మధ్యాహ్నం పూజలు నిర్వహించి ఆలయాన్ని మూసేయన్నారు. మూడు రోజుల విరామం తర్వాత డిసెంబర్ 30న సాయంత్రం ఐదు గంటలకు మకరవిళక్కు పర్వదినం రోజున ఆయ్యప్ప ఆలయాన్ని తిరిగి తెరవనున్నారు. మకర సంక్రాంతి రోజున భక్తులు జ్యోతి దర్శనం చేసుకోనున్నారు. ఆ తర్వాత జనవరి 20న మరోసారి ఆలయాన్ని మూసివేయనున్నారు తెలియజేశారు ఆలయ అధికారులు.

ఇవి కూడా చదవండి: