Mobile Creamation: అంతిమ సంస్కారాల కోసం ‘సంచార దహన వాటిక’
Mobile Creamation: ఈ సమాజంలో మనిషి పుట్టుక ఎంత నిజమో.. చావు అంతే నిజం. ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి మనిషి చావక తప్పదు. అయితే మన ఆచారాల ప్రకారం చనిపోయిన వ్యక్తికి గౌరవప్రదంగా వీడ్కోలు పలకాలని చూస్తారు. ఎవరి స్థాయికి తగినట్లు.. వారు అంత్యక్రియలు నిర్వహిస్తారు. ప్రస్తుతం ఈ దహన సంస్కారాల ఖర్చు పెరగటంతో పేదవాళ్లు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అలా ఇబ్బంది పడే పేదవారి కోసం ఓ సంచార దహన వాటికను తయారు చేశారు కర్ణాటకలోని ఓ వ్యవసాయ సహకార సమితి.
కర్ణాటకలోని (Karnataka) తీరప్రాంత జిల్లాల్లో ఈ సమస్య ఎక్కువైంది.
చాలా గ్రామాల్లో ఎవరైనా చనిపోతే వారి అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు అక్కడి ప్రజలు అనేక ఇబ్బందులు పడేవారు.
సరైన రోడ్లు లేక.. వర్షాల సమయంలో దహన సంస్కారాలకు నానా అవస్థలు పడేవారు.
ముఖ్యంగా కరోనా సమయంలో ఈ సమస్య తీవ్రరూపం దాల్చింది. కరోనా సోకి ఒక వ్యక్తి చనిపోతే పెరట్లోనే దహన సంస్కారాల్ని నిర్వహించాల్సి వచ్చింది.
దీంతో అక్కడి వ్యవసాయ సహకార సమితి సభ్యులు బాగా ఆలోచించి.. ఏదైనా చేయాలని భావించారు. ఆ ఆలోచనల్లోంచే పుట్టింది ఈ సంచార దహన వాటిక.
బైందూరు నియోజకవర్గంలోని ముడూరు వ్యవసాయ సహకార సమితి రూ. 5.8 లక్షలతో కొత్త పరికరాన్ని తయారు చేసి దానికి సంచార శ్మశానం అని పేరు పెట్టారు.
ఈ వాహన రవాణా, దహన సంస్కారానికి అయ్యే ఖర్చును ఆ సంఘమే భరిస్తుండటం ఇక్కడ మెచ్చుకొదగ్గ విషయం.
పర్యావరణ హితాన్ని దృష్టిలో ఉంచుకుని.. ఈ వాహనాన్ని రూపొందించారు. ఈ పరికరం 7 అడుగుల పొడవు, 2 అడుగుల వెడల్పు, 4 అడుగుల ఎత్తు ఉంటుంది. శవదహన సమయంలో ఎవరికీ కనపడకుండా పైన ఒక డోమ్‌ను అమర్చుకునే సదుపాయం ఉంటుంది.
విద్యుత్, గ్యాస్ రెండింటితో పని చేసే విధంగా ఈ పరికరంను రూపొందించారు.
ఒక ఒక మృత దేహాన్ని దహనం చేసేందుకు 10 కిలోల గ్యాస్, 100 గ్రాముల కర్పూరం అవసరమవుతుందని వ్యవసాయ సహకార సమితి సంఘం సభ్యులు తెలిపారు. కేరళకు చెందిన స్టార్ ఛైర్ సంస్థ దీన్ని తయారు చేసింది.
విద్యుత్, గ్యాస్ తో పని చేయడం వల్ల.. పర్యావరణానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని అంటున్నారు.
ఈ యంత్రంలో కొద్ది నిమిషాల్లోనే దహన ప్రక్రియ పూర్తవుతుందని పేర్కొన్నారు.
మృతదేహం కాలిన అనంతరం.. బూడిద, ఇతర అవశేషాలు కింద అమర్చిన ఒక పేటికలోకి చేరతాయి.
వాటిని నిమజ్జనం నిమిత్తం మృతుల కుటుంబ సభ్యులకు అందిస్తారు. కర్ణాటకలో ఇలాంటి సంచార శ్మశానాన్ని వినియోగించడం ఇదే తొలిసారి.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/