Home / terrorists
Huge Encounter breaks out between terrorists: జమ్ముకశ్మీర్ కాల్పులతో మరోసారి దద్దరిల్లిపోయింది. జమ్ముకశ్మీర్‌లోని కుల్గాంలో భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. కుల్గాంలో భద్రతాదళాగాలు, ఉగ్రవాదులకు మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. అలాగే ఇద్దరు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. మరో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతాదళాగాలు అదుపులోకి తీసుకున్నాయి. దక్షిణ కశ్మీర్‌లోని కుల్గాంలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. బెహిబాగ్ ప్రాంతంలోని కడ్డర్‌లో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారం తెలుసుకున్నా భద్రతదళాగాలు కార్డెన్ సెర్చ్ […]
మణిపూర్ లో పౌరులపై అత్యాధునిక ఆయుధాలు ప్రయోగిస్తున్న ఉగ్రవాద గ్రూపులపై ప్రతీకార, రక్షణ చర్యలలో కనీసం 30 మంది ఉగ్రవాదులు హతమయ్యారని ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ ఆదివారం తెలిపారు.ఈ ఉగ్రవాదులు వివిధ ప్రాంతాల్లో హతమయ్యారు. కొందరిని భద్రతా బలగాలు అరెస్టు చేశాయని ముఖ్యమంత్రి తెలిపారు.
Bandi Sanjay: అనంతగిరిలో ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఉగ్రవాదుల నివారణకు ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు.
పాకిస్తాన్‌లోని తమ ఉన్నతాధికారులతో "రహస్యంగా" కమ్యూనికేట్ చేయడానికి మిలిటెంట్ గ్రూపులు ఉపయోగించిన కనీసం 14 మొబైల్ అప్లికేషన్లను కేంద్రం నిషేధించింది. ప్రభుత్వం నిషేధించిన వాటిలో క్రిప్వైజర్, ఎనిగ్మా, సేఫ్స్విస్, విక్రమ్, మీడియాఫైర్, బ్రియార్, బీఛాట్, నందబాస్, కొనిన్, ఇమో, ఎలిమెంట్, సెకండ్ లైన్, జంగి అండ్ త్రీమా ఉన్నాయి.
పహల్గామ్లోని లెవార్ గ్రామంలో ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ అమీర్ ఖాన్‌కు చెందిన భవనాన్ని జమ్మూ కాశ్మీర్ పరిపాలనా యంత్రాంగం శనివారం బుల్డోజర్లో కూల్చివేసింది.
ఓ హోటల్‌పై ఉగ్రవాదులు ఘాతుకానికి తెగబడ్డారు. పేలుడు పదార్ధాలతో ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో తొమ్మిది మంది అమాయకులు దుర్మరణం చెందారు. ఈ దారుణ ఘటన సోమాలియాలో జరిగింది.
తీవ్రవాదులతో సంబంధాలు కలిగివున్నందుకు జమ్ము కశ్మీర్ లో ఐదుగురు ప్రభుత్వ ఉద్యోగులను సర్వీసు నుండి తొలగించారు. నివేదికల ప్రకారం, ఉద్యోగులు నార్కో-టెర్రర్ సిండికేట్‌ను నడుపుతున్నారు మరియు ఉగ్రవాద దాడులను నిర్వహించడానికి నిషేధిత సంస్థలకు సహాయం చేస్తున్నారు.
శనివారం జమ్మూ కాశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో పండ్ల తోటలకు వెళుతున్న పూరన్ క్రిషన్ అనే కాశ్మీరీ పండిట్‌ను ఉగ్రవాదులు కాల్చిచంపినట్లు అధికారులు తెలిపారు.
హైదరాబాద్‌లో భారీ ఉగ్ర కుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ నేతలే టార్గెట్‌గా పేలుళ్లకు కుట్ర పన్నిన జాహిద్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలు ఉగ్రవాద గ్రూపులతో జాహిద్‌కు లింకులు వున్నట్లుగా సమాచారం.
నిత్యం తుపాకుల శబ్దాలతో జమ్మూకశ్మీర్ అట్టుడుకుతుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో అనే ఆందోళనలో అక్కడి ప్రజలు జీవనం సాగిస్తున్నారు. కాగా మంగళవారం నాడు భద్రతాబలగాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పులతో జమ్మూ ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు.