Last Updated:

Karnataka: అందరూ బెంగళూరు వచ్చేయండి.. ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ ఆదేశాలు

కర్ణాటకలో ఎన్నికలు ముగిశాయి. మే 13 (శనివారం) రాజకీయ పార్టీల భవితవ్యం తేలిపోనుంది. దీంతో నాయకుల్లో కొత్త ఆందోళనలు నెలకొన్నాయి.

Karnataka: అందరూ బెంగళూరు వచ్చేయండి.. ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ ఆదేశాలు

Karnataka: ర్ణాటకలో ఎన్నికలు ముగిశాయి. మే 13 (శనివారం) రాజకీయ పార్టీల భవితవ్యం తేలిపోనుంది. దీంతో నాయకుల్లో కొత్త ఆందోళనలు నెలకొన్నాయి. కర్ణాటక ఎలక్షన్స్ లో వచ్చిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. ఫలితాల్లో హంగ్ ఏర్పడే అవకాశం ఉంది. దీంతో ప్రదాన పార్టీలన్నీ తమ ఎమ్మెల్యేలు జారిపోకుండా చూసుకునేందుకు అన్ని ప్రయత్నాలు మొదలుపెట్టాయి. కమలం పార్టీ చేసే ఆపరేషన్ లకు ఎమ్మెల్యేలు చిక్కకుండా ఉండేందుకు కాంగ్రెస్ పార్టీ ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటోంది. ఫలితాలు వెలువడి.. కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యే వరకు అభ్యర్థులు బెంగళూరు రావాలని, నిర్థేశించిన ప్రాంతంలో ఉండాలని సూచించింది. రేపు రిజల్ట్ వెల్లడికానుండటంతో కాంగ్రెస్ ఈ మేరకు చర్యలు తీసుకుంటోంది.

అయితే ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పినా .. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మాత్రం తమకు పూర్తి స్థాయి మెజార్టీ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. ఒక వేళ హంగ్ వస్తే.. అధికారం కోసం ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ఆకర్షించేందుకు కూడా వ్యూహాలు రచిస్తున్నట్టు సమాచారం.

ఆ పార్టీలు మమ్మల్ని సంప్రదించాయి: జేడీఎస్(Karnataka)

కాగా, ఎగ్జిట్ పోల్స్‌ అంచనాల తర్వాత కాంగ్రెస్, బీజేపీ పార్టీల నేతలు తమను సంప్రదించారని జేడీ(ఎస్‌) నేత హెచ్‌డీ కుమారస్వామి వ్యాఖ్యానించారు. ‘ఇప్పటికే మేము నిర్ణయం తీసుకున్నాం. సరైన సమయంలో దానిని ప్రకటిస్తాం’అని జేడీ(ఎస్‌)కు చెందిన తన్వీర్‌ అహ్మద్ పేర్కొన్నారు. ఈ ఎలక్షన్ లో కుమారస్వామి కింగ్ మేకర్‌గా కాదు.. కింగ్‌గా మారబోతున్నారని ఆయన జోస్యం చెప్పారు.

 

పార్టీ కోసం ఎంతగానో కష్టపడ్డా(Karnataka)

కర్ణాటక ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలపై డీకే శివకుమార్‌ పరోక్షంగా స్పందించారు. ‘పార్టీ కోసం ఎంతగానో కష్టపడ్డాను. రాష్ట్రంలో పార్టీ బాధ్యతలు నాకు అప్పగించిన తర్వాత నేను నిద్రపోలేదు. వేరే వారిని కూడా నిద్ర పోనివ్వలేదు. పార్టీకి ఏది అవసరమో అది చేశాను. కాంగ్రెస్‌ పార్టీ ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది’ అని ఆయన వ్యాఖ్యానించారు.

 

2018 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఆ ఎన్నికల్లో ఏ పార్టీకి మెజార్టీ రాకపోవడంతో మొదట బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే, బలనిరూపణలో విఫలం అవ్వడంతో మూడు రోజులకే యడ్యూరప్ప ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయారు. ఆ తర్వాత కాంగ్రెస్‌, జేడీఎస్‌ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయితే ఎమ్మెల్యేల తిరుగుబాటుతో ఆ ప్రభుత్వం ఏడాదికే కుప్పకూలింది. అనంతరం బీజేపీ మళ్లీ పగ్గాలు అందుకుంది.