Chhattisgarh High Court: భార్యతో బలవంతంగా అసహజ శృంగారం నేరం కాదు.. హైకోర్టు సంచలన తీర్పు
Chhattisgarh High Court says Unnatural Sex With Wife Without Consent Not Offence: ఛత్తీస్‌గఢ్ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. భార్యతో బలవంతపు అసహజ శృంగారం చేయడం శిక్షార్హమైన నేరం కాదంటూ ఛత్తీస్‌గఢ్ హైకోర్టు పేర్కొంది. భార్య వయసు 15 ఏళ్లు దాటిన సమయంలో భర్త చేసే ఏ శృంగారాన్ని అత్యాచారంగా పరిగణించలేమని, ఆమె ఒప్పుకోకున్నా.. అసహజ శృంగారానికి ఇది వర్తిస్తుందని తీర్పు హైకోర్టు తీర్పు ఇచ్చింది.
ఇదిలా ఉండగా, 2017లో బస్తర్ జిల్లాలో అసహజ శృంగారం కారణంగా ఓ వ్యక్తి భార్య చనిపోయింది. దీంతో ఆమె భర్తను పోలీసులు అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. అనంతరం ఆయననుమెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపర్చారు. ఈ మేరకు ఆమె ఇచ్చిన మరణ వాంగ్మూలం ఆధారంగా జగదల్ పుర్‌లోని అడిషనల్ సెషన్స్ న్యాయమూర్తి ఆయనకు పదేళ్ల శిక్ష విధించారు. ఆ తర్వాత ఆయన హైకోర్టును ఆశ్రయించాడు. ఈ కేసు విచారణ సందర్భంగా జస్టిస్ నరేంద్ర కుమార్ వ్యాస్ ధర్మాసనం సంచలన తీర్పు ఇచ్చింది.
2013లో ఐపీసీ సెక్షన్ 373కి చేసిన సవరణ ఆధారంగా నిందితుడు చేసిన చర్యను నేరంగా పరిగణించలేమని వెల్లడించింది. ఈ కేసు అత్యాచారం కిందికి రాదని, దీని సమ్మతి అనేందుకు ప్రాధాన్యం లేదని వివరణ ఇచ్చింది. కావును ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఆమె భర్తను జైలు నుంచి రిలీజ్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.