Last Updated:

Maoist : పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టు ఉషారాణి

మావోయిస్టు నాయకురాలు అలూరి ఉషారాణి అలియాస్‌ విజయక్క పోలీసుల ఎదుట లొంగిపోయారు.

Maoist : పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టు ఉషారాణి

Maoist: మావోయిస్టు నాయకురాలు అలూరి ఉషారాణి అలియాస్‌ విజయక్క పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఆమెను తెలంగాణ పోలీసులు నేడు మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ మావోయిస్టు పార్టీ‌లో అధిపత్య పోరు కొనసాగుతోందని. ఎప్పుడైనా కూలిపోయే అవకాశం ఉందన్నారు. విలీన సమయంలో గ్రూపుల మధ్య విభేదాలు వచ్చినట్టుగా చెప్పారు. మావోయిస్టు అగ్రనేతలంతా అనారోగ్యం పాలయ్యారని తెలిపారు. అనారోగ్యానికి గురైన మావోయిస్టు లీడర్లు లొంగిపోతే వైద్యం అందిస్తామని అన్నారు. లొంగిపోయిన వారికి ప్రభుత్వపరంగా అన్ని సహాయక చర్యలు అందిస్తామని హామీ ఇచ్చారు.

31 ఏళ్ల పాటు ఆజ్ఞాతంలో ఉన్న ఉషారాణి అనారోగ్య కారణాలతో లొంగిపోతున్నట్లు తెలిపారు. విద్యాభ్యాసం చేస్తున్న సమయంలోనే ఆమె పీపుల్స్ వార్‌ అనుబంధ గ్రూప్స్‌లో పనిచేశారని చెప్పారు. మొబైల్ పొలిటికల్ టీచర్‌గా దండకారణ్యంలో సేవలందించారని తెలిపారు. మావోయిస్టు పొలిటికల్ మ్యాగజైన్స్‌కు ఎడిటర్ గా పనిచేశారని చెప్పారు.అనేక కేసులతో ఉషా రాణికి సంబంధం ఉందన్నారు.

ఇక, మావోయిస్టు ఉషారాణి స్వ‌స్థ‌లం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని తెనాలి. ఆమె మ‌ద్రాస్ యూనివ‌ర్సిటీలో ఎంఏ చ‌దివారు. ఆమె వివిధ హోదాల్లో మావోయిస్టు పార్టీలో ప‌ని చేశారు. ఉషా రాణి తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌లో అనేక హింసాత్మక సంఘటనలలో పాల్గొన్నారు. ఇందులో భద్రతా దళాలపై ఐదు దాడులు, పోలీసులతో మూడు ఎన్‌కౌంటర్లు, మూడు పబ్లిక్, ప్రైవేట్ బ్లాస్టింగ్ కేసులు, ఒక అపహరణ కేసు, రెండు దాడి కేసులు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి: