Published On:

Monsoon: దేశంలో ఎనిమిది రాష్ట్రాలకు వాతావరణశాఖ రెడ్ అలర్ట్

Monsoon: దేశంలో ఎనిమిది రాష్ట్రాలకు వాతావరణశాఖ రెడ్ అలర్ట్

IMD Issued Red Alert: ఉత్తర భారతదేశంలో వర్షాలు దంచికొడుతున్నాయి. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జార్ఘండ్ లో కుండపోత వర్షాలు పడుతున్నాయి. వీటితో పాటు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, ఒడిశా, రాజస్థాన్ రాష్ట్రాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆయా రాష్ట్రాల్లో రేపటి నుంచి జులై 5 వరకు భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది.

 

ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాలకు తోడు వరదలు సంభవించడంతో పలువురు గల్లంతయ్యారు. దీంతో చార్ ధామ్ యాత్రను కూడా తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు రాష్ర్ట ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. పలుచోట్ల కొండచరియలు విరిగిపడి కొందరు చనిపోగా.. రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. అలాగే జార్ఖండ్ కూడా అతలాకుతలం అవుతోంది. నిన్న రాష్ట్రంలో కురిసిన వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. రోడ్లపై మోకాలిలోతు వరద చేరింది. జంషెడ్ పూర్ లోని ఈస్ట్ సింగ్ భూమ్ ప్రాంతంలో ఖార్ ఖాయ్, సుబర్ నరేఖా నదులు ప్రమాదస్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. అధికారులు వరద బాధితలకు పునరావాసం కల్పిస్తున్నారు. నిత్యవసరాలు, టార్పాలిన్, ప్లాస్టిక్ షీట్లు పంపిణీ చేశారు.

 

మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలో వాతావరణం చల్లగా ఉంది. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 2 నుంచి 5 డిగ్రీల వరకు పడిపోయాయి. ఇక హిమాచల్ ప్రదేశ్ లోనూ భారీగా వర్షాలు పడుతున్నాయి. పలుచోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. నదులు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. హిమాచల్ ప్రదేశ్ లో పలు భవనాలు ధ్వంసమయ్యాయి.

ఇవి కూడా చదవండి: