Last Updated:

Rains : తెలుగు రాష్ట్రాలలో ఏ ఏ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయంటే..?

తెలుగు రాష్ట్రాలలో వర్షాలు బ్రేక్ ఇవ్వడం లేదు. ఈ తరుణంలోనే ఈరోజు కూడా రాష్ట్రంలో భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని.. అదే రీతిలో రుతుపవన ద్రోణి తూర్పు భాగం వాయువ్య బంగాళాఖాతం వరకు విస్తరించి ఉండడంతో ఉత్తరాంధ్రలో

Rains : తెలుగు రాష్ట్రాలలో ఏ ఏ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయంటే..?

Rains : తెలుగు రాష్ట్రాలలో వర్షాలు బ్రేక్ ఇవ్వడం లేదు. ఈ తరుణంలోనే ఈరోజు కూడా రాష్ట్రంలో భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని.. అదే రీతిలో రుతుపవన ద్రోణి తూర్పు భాగం వాయువ్య బంగాళాఖాతం వరకు విస్తరించి ఉండడంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అలానే దక్షిణ కోస్తా, రాయలసీమల్లో ఒక మోస్తరు వానలు పడుతున్నాయి.

ఏపీలో..

వాతావరణ శాఖ అంచనాల ప్రకారం.. ఈరోజు అల్లూరి సీతారామరాజు, బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, బాపట్ల, తూర్పుగోదావరి, ఏలూరు, గుంటూరు, కాకినాడ, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, పార్వతీపురం మన్యం, పశ్చిమగోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయంటున్నారు. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు పడతాయంటున్నారు. అదే విధంగా శుక్ర, శనివారాల్లో కూడా అధికంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

 

తెలంగాణలో..

హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరి, సిద్దిపేట, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, ఆదిలాబాద్‌, కుమ్రం భీం ఆసిఫాబాద్‌, జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు పడతాయని చెబుతోంది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ఉంటాయని తెలిపింది.