Last Updated:

Kodali Nani Comments: నన్ను టార్గెట్ చేసినా భయపడేది లేదు.. కొడాలి నాని

రుషికొండలోని భవనాలు జగన్ నివాసాలు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైసీపీ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. ప్రభుత్వ భవనాల్లో, గెస్ట్ హౌస్ లో ఉండాల్సిన అవసరం జగన్ కు లేదన్నారు

Kodali Nani Comments: నన్ను టార్గెట్ చేసినా భయపడేది లేదు.. కొడాలి నాని

Kodali Nani Comments: రుషికొండలోని భవనాలు జగన్ నివాసాలు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైసీపీ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. ప్రభుత్వ భవనాల్లో, గెస్ట్ హౌస్ లో ఉండాల్సిన అవసరం జగన్ కు లేదన్నారు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా సొంత నివాసాల్లోనే జగన్ ఉంటారన్నారు. విశాఖను రాజధానిగా తీర్చిదిద్దడానికి అంతర్జాతీయ గెస్ట్ ల కోసం గెస్ట్ హౌస్ కట్టారని తెలిపారు.తనను టార్గెట్ చేసినా భయపడే ప్రసక్తే లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు తనను టార్గెట్ చేస్తే వైసీపీ ఆగిపోతుందా..తననే కాదు జగన్ నే టార్గెట్ చేస్తారేమో అని హాట్ కామెంట్స్ చేశారు. వైసీపీ నేతలతో జగన్ సమావేశమైన సందర్భంగా ఆ సమావేశం వివరాలను కొడాలి నాని మీడియాకు వివరించారు. టీడీపీ బెదిరింపులకు తాను భయపడబోనని కొడాలి నాని స్పష్టం చేశారు.

ప్రభుత్వానికి ఆరు నెలల సమయం..(Kodali Nani Comments)

మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి క్యాంపు ఆఫీసులోని ఫర్నిచర్ పై కూడా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని కొడాలిని నాని మండిపడ్డారు. ఫర్నిచర్ కు రేటు కడితే చెల్లిస్తారని తెలిపారు. జగన్ క్యాంప్ ఆఫీసులోని ఫర్నిచర్ అక్కడే వుందని ఎక్కడికీ పోలేదని చెప్పారు. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ తన అధికారిక ఫర్నిచర్ ను పదవీకాలం ముగిసిన తరువాత తన బైక్ షోరూంలో పెట్టుకున్నారని అన్నారు. అటువంటి వ్యక్తులను ఫర్నిచర్ దొంగ అంటారని వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వానికి ఆరు నెలల సమయం ఇద్దామని జగన్ చెప్పారని అన్నారు. ఈ సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేస్తారా లేదా అన్నది తేలుతుందన్నారు. రివ్యూ చేయకుండానే జగన్ నివాసం వద్ద సెక్యూరిటీ , ఆంక్షలు తొలగించడం దారుణమని కొడాలి నాని పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాలు శకని పాచికలు వేసినట్లుగా ఉన్నాయని అన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీలకు కావలసినట్లుగా పాచికలు వేనిసట్లు ఉందని అన్నారు. వైసీపీ కార్యకర్తలకు అండగా ఉండాలని జగన్ చెప్పారని తమకు ఓటు వేసిన కార్యకర్తలను అందరినీ కాపాడుకుంటామని నాని చెప్పారు.

 

ఇవి కూడా చదవండి: