Last Updated:

CPI Ramakrishna: వైజాగ్ ను నాశనం చేసేది వైకాపా మంత్రులే.. సిపిఐ రామకృష్ణ

ఏపికి అత్యంత తలమాణికమైన విశాఖ ఉక్కును కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు పరం చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ప్రతిఘటించకపోవడాన్ని సిపిఐ నేత రామకృష్ణ నిలదీసారు

CPI Ramakrishna: వైజాగ్ ను నాశనం చేసేది వైకాపా మంత్రులే.. సిపిఐ రామకృష్ణ

Vijayawada: ఏపికి అత్యంత తలమాణికమైన విశాఖ ఉక్కును కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు పరం చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ప్రతిఘటించకపోవడాన్ని సిపిఐ నేత రామకృష్ణ నిలదీసారు. వైజాగ్ ను నాశనం చేస్తున్నది స్వయానా వైకాపా మంత్రులేనంటూ ఆయన విమర్శించారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కోర్టు తీర్పుతో అమరావతి ముగిసిన అధ్యాయం అనుకొన్నామన్నారు. తిరిగి పాతపాటనే పాడుతూ అధికార పార్టీ 3 రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 12న అమరావతి నుండి చేపడుతున్న రెండవదఫా చేపడుతున్న మహా పాదయాత్ర పై మంత్రులు రెచ్చగొట్టేలా మాట్లాడడం సబబు కాదని హితవు పలికారు. విశాక అభివృద్ది అంటే ఓ రోజులో జరిగిందికాదని గుర్తించుకోవాలన్నారు. ఉక్కు కర్మాగారం, పోర్టుల రాకతోనే వైజాగ్ అభివృద్ది చెందిందని గుర్తుంచుకోవాలని ఆయన మంత్రుల పై మండిపడ్డారు. లేపాక్షి భూములను చౌకగా కొంటున్న జగన్ మేనమామ కుమారుడు కొంటున్నారన్న రామకృష్ణ, వాటిని పేదలకు పంచాలని డిమాండ్ చేశారు.

ఇవి కూడా చదవండి: