YS Avinash Reddy: ఎంపీ అవినాష్ లేఖపై స్పందించిన సీబీఐ.. 19న విచారణకు రావాలని నోటీసులు
YS Avinash Reddy: సీబీఐ అందించిన నోటీసులకు ముందు.. నిర్ణయించుకున్న షెడ్యూల్ కార్యక్రమాలకు హాజరుకావాల్సి ఉందని అందులో అవినాష్ వివరించారు.
YS Avinash Reddy: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ఈ రోజు (మంగళవారం) విచారణకు రాలేనంటూ ఎంపీ అవినాశ్ రెడ్డి సీబీఐకి లేఖ రాసిన విషయం తెలిసిందే. అయితే లేఖపై సీబీఐ స్పందించింది. ఈ నెల 19న విచారణకు రావాలని సీబీఐ మరోసారి నోటీసులు అందించింది.
స్పందించిన సీబీఐ..
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ఈ రోజు (మంగళవారం) విచారణకు రాలేనంటూ ఎంపీ అవినాశ్ రెడ్డి సీబీఐకి లేఖ రాసిన విషయం తెలిసిందే. అయితే లేఖపై సీబీఐ స్పందించింది. ఈ నెల 19న విచారణకు రావాలని సీబీఐ మరోసారి నోటీసులు అందించింది.
సీబీఐ అందించిన నోటీసులకు ముందు.. నిర్ణయించుకున్న షెడ్యూల్ కార్యక్రమాలకు హాజరుకావాల్సి ఉందని అందులో అవినాష్ వివరించారు. అత్యవసర పనుల కారణంగానే విచారణకు రాలేకపోతున్నానని, నాలుగు రోజుల గడువు కావాలని కోరారు. దీంతో ఈ నెల 19న విచారణకు హాజరవ్వాలని కోరింది. ఈ మేరకు వాట్సాప్ ద్వారా మరోసారి నోటిసులు అందించింది. ఈ నెల 19న ఉదయం.. 11 గంటలకు విచారణకు రావాలని సూచించింది.
హైదరాబాద్ నుంచి పులివెందుల వెళ్తుండగా మార్గమధ్యంలో సీబీఐ నోటీసులు పంపింది. సీఆర్‌పీసీ 160 సెక్షన్ కింద సోమవారం ఎంపీ అవినాష్‌కు సీబీఐ నోటీసులు జారీ చేయగా.. నాలుగు రోజులు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉన్నందున విచారణకు సమయం కోరుతూ లేఖ రాశారు.
షార్ట్ నోటీసు ఇచ్చినందున.. విచారణకు మరింత సమయం ఇవ్వాలని అవినాష్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ముందస్తు కార్యక్రమాలు ఉన్నందున రాలేనని చెప్పారు.