Last Updated:

International Childhood Cancer Day : పిల్లలలో క్యాన్సర్ కు సంబంధించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన లక్షణాలివే..!

భారతదేశం అనేక రకాల కాన్సర్ల నుంచి సవాళ్లు ఎదుర్కొంటోంది. చిన్నపిల్లల్లో కూడా భూతం బయటపడడం ఆందోళనను కలిగిస్తుంది. ఏటా దేశవ్యాప్తంగా 50,000 మంది పిల్లలు వివిధ రకాల కాన్సర్లతో బాధపడుతున్నారు.

International Childhood Cancer Day : పిల్లలలో క్యాన్సర్ కు సంబంధించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన లక్షణాలివే..!

International Childhood Cancer Day : భారతదేశం అనేక రకాల కాన్సర్ల నుంచి సవాళ్లు ఎదుర్కొంటోంది.

చిన్నపిల్లల్లో కూడా భూతం బయటపడడం ఆందోళనను కలిగిస్తుంది.

ఏటా దేశవ్యాప్తంగా 50,000 మంది పిల్లలు వివిధ రకాల కాన్సర్లతో బాధపడుతున్నారు.

ఇతర దేశాల్లో 80-90% మంది పిల్లలు క్యాన్సర్ ను జయిస్తే, మన దగ్గర మాత్రం దీని విలువ 60 శాతానికే పరిమితం అయ్యింది.

రోగనిర్ధారణ ఆలస్యం కావడం, ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక, సామాజిక పరిస్థితులు చికిత్సను మధ్యలోనే వదిలివేయడానికి కారణాలుగా నిలుస్తున్నాయి.

చిన్నపిల్లల్లో కాన్సర్లపై అవగాహనా కల్పించేందుకు ప్రతిఏటా ఫిబ్రవరి 15 న “ప్రపంచ చిన్నపిల్లల క్యాన్సర్ అవగాహన దినోత్సవంగా” (International Childhood Cancer Day)  జరుపుకుంటున్నారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ 2023 సంవత్సరానికి గాను “క్లోజ్ ది కేర్ గ్యాప్” నినాదాన్ని ఎంచుకుంది.

14 ఏళ్ల లోపు వచ్చే క్యాన్సర్ ను చైల్డ్ హుడ్ క్యాన్సర్ అని అంటారు. పిల్లల్లో క్యాన్సర్ ను ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది.

అప్పుడే త్వరగా చికిత్స అందించి నయం చేయవచ్చని వైద్యులు నిపుణులు సూచిస్తున్నారు.

కనుక ఇప్పుడు మనం క్యాన్సర్ రకాలు, వాటి లక్షణాలు గురించి తెలుసుకుందాం..

ఆ లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి..  

చిన్నపిల్లల క్యాన్సర్ అవేర్‌నెస్ డే సందర్భంగా కామినేని హాస్పిటల్స్ సీనియర్ పీడియాట్రిక్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ఎస్ జయంతి మాట్లాడుతూ.. “మీ పిల్లలకు క్యాన్సర్ ఉందని సూచించే కొన్ని సాధారణ లక్షణాల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. వీటిలో అలసట, తలనొప్పి, కీళ్లనొప్పి, వాపు, జ్వరం లేదా రాత్రిపూట చెమటలు పట్టడం, మెడ లేదా చంకలలో వాపు లేదా శోషరస కణుపులు, సులభంగా గాయపడటం, రక్తస్రావం వంటివి ముఖ్య లక్షణాలు. వీటిలో ఏవైనా ఉన్నట్లయితే, వీలైనంత త్వరగా పీడియాట్రిక్ ఆంకాలజిస్ట్ నుంచి వైద్య సలహా పొందడం చాలా అవసరం” అని తెలిపారు.

“చిన్నపిల్లల క్యాన్సర్ గురించి తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి. అనారోగ్య సమస్యలు, తరచుగా వచ్చే ఇన్ఫెక్షన్‌లు, వైరల్ ఇన్‌ఫెక్షన్‌లు, బరువు తగ్గడం లేదా ఆకలి లేకపోవడం, తలనొప్పి లేదా తట్టుకోలేని జ్వరం వంటివి మీ పిల్లల్లో క్యాన్సర్‌కు కారణాలు కావోచ్చు. తల్లిదండ్రులు వీటిపై అశ్రధ్ద చూపకుండా వీలైనంత త్వరగా వైద్య సలహా తీసుకోవాలి” అని డాక్టర్ జయంతి అన్నారు. పిల్లలలో కనిపించే ప్రధాన క్యాన్సర్లు లుకేమియా, ఎవింగ్ సార్కోమా వంటి మెదడు/వెన్నెముక కణితులు. పిల్లలలో ఇటీవల గుర్తించబడిన కొత్త రకాల క్యాన్సర్లలో లుకేమియా, లింఫోమా కూడా ఉన్నాయి. శరీరంపై అసాధారణ గడ్డలు, నిరంతర తలనొప్పి లేదా వాంతులు, బరువు తగ్గడం లేదా అలసట వంటివి వారి పిల్లల ఆరోగ్యంలో ఏవైనా మార్పుల గురించి తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి.

ఈ చిన్నపాటి క్యాన్సర్‌లకు చికిత్స చేయడానికి ముందస్తుగా గుర్తించడం కీలకం. తల్లిదండ్రులు ఈ లక్షణాల గుర్తించి అప్రమత్తంగా ఉండటం ఎంతో అవసరం అని ఆమె తెలిపారు. లుకేమియా వంటి రక్త క్యాన్సర్‌లను నిర్దారించడానికి అనుభవైజ్ఞులైన వైద్యులచేత రోగ నిర్ధారణ కోసం ఎముక మజ్జ పరీక్షలు అవసరం ఉంటాయి. ఎర్ర రక్త కణాల కౌంట్ ను ప్రమాణికంగా చేసుకుని పిల్లల్లో కొన్ని రకాల క్యాన్సర్లను నిర్ధారిస్తారు. ముందస్తుగా క్యాన్సర్ ను గుర్తించడం ద్వారా వారి జీవితాలను రక్షించవచ్చు. తల్లిదండ్రులు తమ పిల్లలలో ఏదైనా అసాధారణ లక్షణాలను గమనించిన వెంటనే, వారు వారి వైద్యునితో సంప్రదించాలి, అవసరమైతే వారిని ఆంకాలజిస్ట్‌కు సూచించవచ్చు.

ఎటా ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది చిన్నారులు రెటినోబ్లాస్టోమా అనే కంటి క్యాన్సర్ తో బాధపడుతున్నారు. ఈ వ్యాధి కంటి క్యాన్సర్ లొ అత్యంత సాధారణ రకం, ఒకేసారి రెండు కళ్ళను కూడా ప్రభావితం చేస్తుంది. కంటి చూపులో కనిపించే తెల్లటి మెరుపు వంటి లక్షణాలతో కంటిలోని మార్పులను కలిగి ఉంటాయి. తల్లిదండ్రులు, సంరక్షకులు దృష్టి సమస్యలు లేదా కంట్లో ఎరుపు, వాపు, ఒకటి లేదా రెండు కళ్ళలో నొప్పి వంటివి గమనించినట్లయితే వైద్యున్ని సంప్రదించాలి.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/