Last Updated:

Nandigam Suresh: వైసీపీ మాజీ ఎంపీకి బిగ్ షాక్.. సుప్రీంకోర్టులో బెయిల్ తిరస్కరణ

Nandigam Suresh: వైసీపీ మాజీ ఎంపీకి బిగ్ షాక్.. సుప్రీంకోర్టులో బెయిల్ తిరస్కరణ

YSRCP Former MP Nandigam Suresh as Supreme Court denies bail: వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు బిగ్ షాక్ తగిలింది. సుప్రీంకోర్టులో ఆయనకు చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీలోని వెలగపూడిలో మరియమ్మ హత్య కేసులో సురేశ్ నిందితుడిగా ఉన్నాడు. ఆయన అరెస్ట్ అయి ప్రస్తుతం జైలులో ఉన్నారు.

ఇటీవల సుప్రీంకోర్టులో బెయిల్ కోసం పిటిషన్ వేయగా.. ఇవాళ విచారణ చేపట్టింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున సిద్ధార్థ లూథ్రా, నందిగం సురేశ్ తరఫున కపిల్ సిబల్ వాదనలు వినిపించారు.

వైసీపీ హయాంలో వెలగపూడిలో 2020లో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో ఓ మహిళ మరియమ్మ మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేయగా.. కేసు ముందుకు సాగలేదు. తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ కేసు తర్వాతు ముందుకు కదిలింది. అనంతరం విచారణలో సురేష్‌ను అరెస్ట్ చేశారు. దీంతో ఆయన బెయిల్ కోసం ఏపీ హైకోర్టును ఆశ్రయించాడు.

అయితే కేసు తీవ్రత కారణంగా ఏపీ హైకోర్టు ఈ బెయిల్‌ను నిరాకరించింది. దీంతో ఆయన మైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులోె బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశాడు. తాజాగా, సుప్రీంకోర్టు కూడా బెయిల్ కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని చెప్పింది.