YS Vjayamma Resigns to YSRCP: వైస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై.. వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన!
వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీలో వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన చేశారు. వైసీపీ గౌరవఅధ్యక్షురాలిపదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. తెలంగాణలో వైఎస్ షర్మిలకు అండగా ఉంటానని ప్రకటించారు.

YS Vjayamma Resigns to YSRCP: వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీలో వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన చేశారు. వైసీపీ గౌరవఅధ్యక్షురాలిపదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. తెలంగాణలో వైఎస్ షర్మిలకు అండగా ఉంటానని ప్రకటించారు.
సీఎం వైఎస్ జగన్ ప్రసంగం అయిన వెంటనే పార్టీ గౌరవ అధ్యక్షురాలి హోదాలో ప్రసంగించిన వైఎస్ విజయమ్మ. షర్మిలను పొగడ్తలతో ముంచెత్తారు. జగన్ జైల్లో ఉన్న సమయంలో పార్టీని ముందుకు తీసుకెళ్లారని, పాదయాత్ర చేసి పార్టీని ప్రజల్లో నిలబెట్టారని గుర్తుచేశారు. ఇప్పుడు వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టినందున, షర్మిలకు అండగా ఉండేందుకు వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
జగన్ కష్టాల్లో వున్నపుడు తన వెంట వున్నానని, ఇపుడు తన రక్తం పంచుకుని పుట్టిన తన కుమార్తె షర్మిల పక్క రాష్ట్రంలో ఒంటరిగా పోరాటం చేస్తున్నందున తనకు అండగా వుండవలసిన అవసరం వుందన్నారు. రెండు రాష్ట్రాల్లో వేర్వేరు పార్టీల్లో వుండటం తగదని భావించినందున తాను వైఎస్సార్ సీపీకి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు.