Last Updated:

Minister Harish rao: భాజపా డిఎన్ఏలోనే అబద్దాలు ఉన్నాయి.. మంత్రి హరీష్ రావు

భాజపా నేతలు దిక్కుమాలిన, దివాళాకోరు రాజకీయాలు చేస్తున్నారని మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, భాజపా అద్యక్షులు బండి సంజయ్ వి నకిలీ, మకిలీ మాటలని హరీష్ రావు విమర్శించారు. అబద్ధాలు చెప్పడం భాజపా డిఎన్ఏగా మరిందని ఆయన వ్యాఖ్యానించారు.

Minister Harish rao: భాజపా డిఎన్ఏలోనే అబద్దాలు ఉన్నాయి.. మంత్రి హరీష్ రావు

Munugode: భాజపా నేతలు దిక్కుమాలిన, దివాళాకోరు రాజకీయాలు చేస్తున్నారని మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, భాజపా అద్యక్షులు బండి సంజయ్ వి నకిలీ, మకిలీ మాటలని హరీష్ రావు విమర్శించారు. అబద్ధాలు చెప్పడం భాజపా డిఎన్ఏగా మరిందని ఆయన వ్యాఖ్యానించారు.

సీఎం కేసిఆర్ పై ఇష్టారాజ్యంగా భాజపా నేతలు మాట్లాడడాన్ని ఆయన తప్పుబట్టారు. మీడియాతో మాట్లాడిన హరీష్ రావు,  8ఏళ్ల తెరాస పాలనలో చేసిన అభివృద్ది ఢిల్లీ దూతలూ చెప్పారన్నారు. కేసిఆర్ సభతో భాజపా నేతలకు కంటిమీద కునుకు రావడంలేదని హేళన చేశారు. రైతు బంధు పధకం కింద అత్యధిక లబ్దిపొందిన వారిలో మునుగోడు నియోజకవర్గం ఉందన్నారు.

మునుగోడులో 95 శాతం మందికి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయన్నారు. బీజేపీ నేతల కళ్లకు పొరలు కమ్మాయని.. అందుకే పథకాలు కనిపించడం లేదన్నారు. టీడీపీ రాజ్యసభ సభ్యులను బీజేపీ విలీనం చేసుకున్నది కరెక్ట్ అయితే, తాము కాంగ్రెస్ ఎమ్మెల్యేలను విలీనం చేసుకుంటే తప్పవుతుందా అని ప్రశ్నించారు. 8 రాష్ట్రాల్లో దొడ్డిదారిన ప్రభుత్వాలను కూల్చింది బీజేపీ కాదా అని నిలదీశారు. పాయింట్- 5 ఎఫ్‌ఆర్‌బీఎమ్ నిధులు ఇవ్వాలంటే మోటార్లకు మీటర్లు పెట్టాలని షరతు పెట్టారని, పాయింట్- 5 అంటే ఏడాదికి 6 వేల కోట్లు.. ఐదేళ్ళకు 30 వేల కోట్లు ఇస్తారని చెప్పారు. మీటర్లు పెట్టి రైతుల మెడకు ఉరితాడు పెట్టే కుట్ర బీజేపీ చేస్తోందని ఆరోపించారు.

తెలంగాణ రైతుల కోసం 30 వేల కోట్లు కేసీఆర్ వదులుకున్నారని తెలిపారు. రెండేళ్లలో కలిపి కేంద్రం రూ.12 వేల కోట్లను ఆపిందని హరీష్‌రావు చెప్పారు. చేనేత వస్త్రాలపై జీఎస్టీ పెంపును మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నామన్నారు. మిషన్ భగీరథకు నిధులు ఇవ్వాలన్న నీతి ఆయోగ్ సిఫార్సును లెక్కచేయడం లేదన్నారు. రూ.1900 కోట్లు ఇవ్వాలంటే 19 పైసలు కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బెంగాల్‌లో బ్రిడ్జి కూలిపోతే అక్కడి ప్రభుత్వాన్ని పడగొట్టమని దేవుడు సిగ్నల్ ఇచ్చాడని ప్రధాని మోదీ అన్నారు… ఇప్పుడు గుజరాత్‌లో తీగల వంతెన పడిపోయింది.. మరి మోదీ ప్రభుత్వాన్ని పడగొట్టాలని దేవుడు సిగ్నల్ ఇచ్చాడనుకోవాలా? అని ప్రశ్నించారు. తాము ప్రజల డబ్బుతో నీళ్లు లిఫ్ట్‌ చేస్తుంటే.. బీజేపీ మాత్రం ఎమ్మెల్యేలను లిఫ్ట్ చేసే ప్రయత్నం చేస్తోందని యెద్దేవా చేశారు. స్వామిజీలు ఎవరో తమకు తెలియదని బీజేపీ నాయకులు అంటున్నారని… మరి కేసులు ఎందుకు వేశారని మంత్రి హరీష్‌రావు ప్రశ్నించారు.

ఇది కూడా చదవండి: Morbi Bridge Collapse: మోర్బీ బ్రిడ్జ్ కూలిన ఘటన పై న్యాయమూర్తిచే విచారణకు కాంగ్రెస్ డిమాండ్

ఇవి కూడా చదవండి: