Last Updated:

YS Sharmila: ఎన్టీఆర్ వర్శిటీ పేరు మార్పును తప్పుబట్టిన షర్మిల

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరును వైఎస్ఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయంగా మార్చిన జగన్ ప్రభుత్వానికి షర్మిల చీవాట్లు పెట్టారు. తెలంగాణ పరిగి నియోజకవర్గంలో పాదయాత్రలో ఉన్న ఆమె ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు బట్టారు.

YS Sharmila: ఎన్టీఆర్ వర్శిటీ పేరు మార్పును తప్పుబట్టిన షర్మిల

Hyderabad: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరును వైఎస్ఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయంగా మార్చిన జగన్ ప్రభుత్వానికి షర్మిల చీవాట్లు పెట్టారు. తెలంగాణ పరిగి నియోజకవర్గంలో పాదయాత్రలో ఉన్న ఆమె ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు బట్టారు. పేరు మార్పును ఖండించిన షర్మిల ముమ్మాటికి తప్పుగా వ్యాఖ్యానించారు. అలా ఎన్ని రోజులు మార్చుకుంటూ పోతారని విమర్శించారు.

బుధవారం నాడు ఏపి శాసనసభ ఆమోదించిన బిల్లుల్లో వర్శిటీ పేరు మార్పును అసెంబ్లీ ఆమోదించింది. వైఎస్ఆర్ టిపి పార్టీలో షర్మిలకు తోడుగా ఉంటున్న తల్లి విజయమ్మ కూడా పేరు మార్పు పై జగన్ పై అసహనం వ్యక్తం చేసిన్నట్లు సమాచారం. వర్శిటీ పేరు మార్పు పై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైకాపా మినహాయించి రాష్ట్రంలో పలు పార్టీలు, వర్గాలు, సంస్ధలు జగన్ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు.

షర్మిల తన పాదయాత్రలో తెలంగాణ పాలకులను ఏకిపారేసారు. పరిగి ఎమ్మెల్యే కుటుంబసభ్యులకు భూములు నొక్కేయడం ఇష్టమట, అసైన్డ్, ఆలయాలు, ప్రభుత్వ భూములను ఎన్ని ఆక్రమించుకొన్నా సరిపోదట అని విమర్శించారు. హాస్టల్ భోజనంలో విద్యార్ధులకు కప్పలు, బొద్దింకలు, బల్లులు, పురుగులు ఉన్నాయని గగ్గోలు పెడుతూ ఆసుపత్రి పాలౌతున్న విద్యార్ధులను ప్రజాప్రతినిధులు పలకరించడం కూడా తీరిక లేకుండా ఉన్నారని  రాష్ట్ర  ప్రభుత్వానికి షర్మిల చురకలు అంటించారు.

ఇవి కూడా చదవండి: