Game Changer: మెగా ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్ – అక్కడ గేమ్ ఛేంజర్ అడ్వాన్స్ బుకింగ్స్ ఒపెన్
Game Changer Advance Booking Now Open: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మోస్ట్ అవైయిటెడ్ మూవీ ‘గేమ్ ఛేంజర్’. ఆర్‌ఆర్‌ఆర్ లాంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పొలిటికల్ థ్రిల్లర్ నేపథ్యంలో డైరెక్టర్ శంకర్ ఈ సినిమాను రూపొందించారు. 2025 జనవరి 10 ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ టీం ప్రమోషన్స్ షూరు చేసింది. వరుసగా గేమ్ ఛేంజర్ అప్‌డేట్స్ వదులుతూ హైప్ క్రియేట్ చేస్తుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ మూవీపై మంచి బజ్ క్రియేట్ చేశాయి.
ముఖ్యంగా లీకైన షూటింగ్ క్లిప్స్ అంచనాలు మరింత రెట్టింపు చేశాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంటో రోజురోజుకు మూవీ హైప్ పెరుగుతుంది. ఇంకా మూవీకి సుమారు నెల రోజులు ఉంది. ఈ క్రమంలో మూవీ అడ్వాన్స్ బుక్కింగ్స్ ఒపెన్ అయ్యాయి. ఈ మేరకు మేకర్స్ కూడా ఓ ప్రకటన ఇచ్చారు. కాగా ఈ మధ్య పాన్ ఇండియా, స్టార్ హీరోల సినిమాలు ఓవర్సిస్‌లో మంచి రెస్పాన్స్ అందుకుంటున్నాయి. దీంతో మన తెలుగు సినిమాలకు అక్కడ మంచి మార్కెట్ ఉంది. ముఖ్యంగా ఓవర్సిస్ మన తెలుగు సినిమా రికార్డు కలెక్షన్స్ రాబడుతూ సత్తా చాటుతున్నాయి.
A massive global storm has begun! #GameChanger overseas bookings are now open!
Experience it in cinemas worldwide from 10-01-2025! ❤️🔥 @shankarshanmugh @advani_kiara @yoursanjali @iam_SJSuryah @MusicThaman @DOP_Tirru @artkolla @AntonyLRuben @SVC_official @ZeeStudios_… pic.twitter.com/Fa342WC23x
— Ram Charan (@AlwaysRamCharan) December 15, 2024
ఈ క్రమంలో ఈ క్రేజ్ మరింత క్యాష్ చేసుకునేందుకు ఓవర్సిస్‌లో నెల రోజుల ముందే బుకింగ్స్ ఓపెన్ చేస్తున్నారు. తాజాగా గేమ్ ఛేంజర్ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఒపెన్ అయ్యాయి. ఇలా ఒపెన్ అవ్వగానే టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయట. కాగా ఇప్పటికే యూకేలో గేమ్ ఛేంజర్ మూవీ టికెట్స్ అడ్వాన్స్ బుకింగ్స్ ఒపెన్ అవ్వగా అక్కడ టికెట్స్ భారీగా సేల్ అవుతున్నాయట. నిజానికి మన తెలుగు సినిమాలు ఓవర్సిస్‌లోనే ఎక్కువ వసూళ్లు చేస్తాయి. యూకే, అస్ట్రేలియా వంటి దేశాల్లో తక్కువ కలెక్షన్స్ చేస్తాయి. కానీ గేమ్ ఛేంజర్ విషయంలో ఆ లెక్కలు మారినట్టు కనిపిస్తున్నాయి.
సరిగ్గా మూవీకి నెల రోజులు ఉందనగా మొన్న యూకేలో గేమ్ ఛేంజర్ టికెట్స్ బక్కింగ్ ఒపెన్ ఒపెన్ అవ్వగా.. వేలల్టిలో అమ్ముడుపోతున్నాయని డిస్ట్రిబ్యూటర్స్ చెబుతున్నారు. తాజాగా ఓవర్సిస్‌లోనూ అడ్వాన్స్ బుకింగ్స్ ఒపెన్ అయ్యాయి. మరి ఓవర్సిస్‌లో ప్రీ సేల్ ఏ రేంజ్‌లో కొనసాగుతుందో చూడాలి. కాగా ఈ సినిమాలో రామ్ చరణ్ ఎన్నికల అధికారిక కనిపించనున్నాడు. డ్యుయెల్ రోల్ పోషిస్తున్న చరణ్ ఓ పాత్రలో పొలిటికల్ లీడర్‌గా కనిపించనున్నాడట. ఇందులో చరణ్ జోడిగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుండగా.. అంజలి మరో ఫీమెల్ లీడ్ రోల్ చేస్తుంది. శ్రీకాంత్, సముద్ర ఖని, సునీల్ వంటి తదితర నటులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.