Last Updated:

74th Republic Day: జనసేన పార్టీ కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు.. త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన పవన్ కళ్యాణ్

74th Republic Day: జనసేన పార్టీ కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు.. త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన పవన్ కళ్యాణ్

74th Republic Day: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 74 వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.

ఈ మేరకు మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ముందుగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన పవన్ కళ్యాణ్.. ఆ తర్వాత జాతీయ గీతాన్ని ఆలపించారు. ఆ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించండి..

అనంతరం పార్టీ కార్యాలయంలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. వైసీపీ సర్కారుపై నిప్పులు చెరిగారు.

కులరాజకీయాలను ఎదుర్కొని నిలబడ్డాను నేను ఎక్కడికీ పారిపోను మీకు సమాధానంగా నిలబడతాను అని చెప్పారు.

పార్టీని నిలిపడం కోసం నా బిడ్డల భవిష్యత్తును కూడా లెక్కచెయ్యకుండా మీరే నా కుటుంబం అనుకుని ప్రజాసేవకే పరిమితమయ్యానని పవన్ చెప్పుకొచ్చారు.

వైసీపీ నేతలకు గట్టి వార్నింగ్..

74వ గణతంత్య్ర దినోత్సవం(74th Republic Day) సందర్భంగా మంగళగిరి వేదికగా జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.

నేరాలు లేని ఆంధ్రప్రదేశ్ ను చూడడమే మేము జనసేన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

ఈ వేర్పాటు వాద ధోరణిని మార్చుకోకపోతే నాలాంటి తీవ్రవాదిని ఇంకొకరిని చూడరు అంటూ ఆయన హెచ్చరించారు.

రాష్ట్రాన్ని మంత్రుల కోసం పంచలేమని రాష్ట్రం కోసం ఎందరో ప్రాణాలను ఫణంగా పెట్టి పోరాడారని ఆయన గుర్తుచేశారు.

విశాఖ ఉక్కు జోలికొస్తే ఊరుకునేది లేదని బల్లగుద్ది చెప్పారు.

ఈ వైసీపీ సన్నాసుల ఆలోచనలు భావజాలంతో విసిగిపోయామని.. ఈ ధోరణిని మార్చుకోకపోతే తోలుతీసి కూర్చోబెడతాం అని ఆయన పేర్కొన్నారు.

వారాహితో ఏపీలో తిరుగుతాను మమ్మల్నెవడ్రా ఆపేది అంటూ చెప్పుకొచ్చారు.

వారాహి జోలికొచ్చి.. నువ్ నాతో గొడవపెట్టుకో చెప్తా అంటూ జగన్ కు వార్నింగ్  పవన్ కళ్యాణ్(Pawan Kalyan) వార్నింగ్ ఇచ్చారు.

ఏపీకి రాజకీయ స్థిరత్వం కావాలి.. లేకుంటే అభివృద్ధి పక్క రాష్ట్రాలకు వెళ్తుందని పవన్‌ విమర్శించారు.

నేను చట్టాలను గౌరవించేవాడిని.. కోడి కత్తితో పోడిపించుకుని డ్రామాలాడేవాడిని కాను అని వ్యాఖ్యానించారు.

 

 

 

 

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/