Home / తాజా వార్తలు
వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలవాలని ఏపీ సీఎం జగన్ పక్కాగా వ్యూహరచన చేస్తున్నారట. అందుకోసం సరైన ముహూర్తాన్ని కూడా ఎంచుకుంటున్నారట. అన్ని విధాలుగా అనుకూలమైన డిసెంబర్ నెల బెటర్ అని ఆయన యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది.
వివాదాస్పద ముస్లిం మత ప్రవక్త జాకీర్ నాయక్ ప్రస్తుతం ఖతర్‌లో హల్చల్ చేస్తున్నాడు. ఖతర్‌లో జరిగే 2022 ఫిఫా వరల్డ్ కప్ సందర్భంగా ఆయన టోర్నమెంట్ జరిగినన్ని రోజుల పాటు మతపరమైన ప్రసంగాలు కొనసాగిస్తాడు.
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో సీఎం జగన్..జనసేనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు ఆ పార్టీ పీఏపీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ట్విట్టర్ ద్వారా కౌంటర్ ఇచ్చారు.
హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వద్ద పీఏగా పనిచేస్తున్న దేవేంద్ర కుమారుడు అక్షయ్ కుమార్ (23) ఆత్మహత్య చేసుకున్నాడు.
రాజస్థాన్‌లో ప్రభుత్వ కార్యక్రమం జరుగుతుండగా మొబైల్ ఫోన్ లో మాట్లాడుతున్న జిల్లాకలెక్టర్ ను సమావేశం నుంచి బయటకు పొమ్మని మంత్రి ఆదేశించారు.
ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లాలో వేర్వేరు చోట్ల మావోయిస్టులు మూడు వాహనాలు, రోడ్డు నిర్మాణ పనుల్లో నిమగ్నమైన రెండు యంత్రాలు, నాలుగు మొబైల్ టవర్లను తగులబెట్టినట్లు పోలీసులు సోమవారం తెలిపారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ విచారణ కొనసాగించాలని సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.
భారతవాతావరణ శాఖ (ఐఎండీ) సూచనల ప్రకారం ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
ఇండోనేషియాలోని ప్రధాన ద్వీపం జావాలో సోమవారం సంభవించిన భూకంపంలో కనీసం 44 మంది మరణించారు . 300 మందికి పైగా గాయపడ్డారు.
మన వాట్సాప్ ను మరొకరు చూస్తే మన గోప్యతకు భంగం కలుగుతుంది కదా డెస్క్ టాప్ లలో వాట్సాప్ లాగిన్ చేసి లాగ్ అవుట్ చెయ్యడం మర్చిపోతే దానిని ఎవరు ఓపెన్ చేసినా వాట్సాప్ ఓపెన్ అవుతుంది. కాగా ఈ సమస్యకు త్వరలో పరిష్కారం లభించనుంది. డెస్క్ టాప్ (కంప్యూటర్లు)పై వాట్సాప్ యాప్ ఓపెన్ అవ్వాలంటే పాస్ వర్డ్ ఇవ్వడం తప్పనిసరి.