Home / తాజా వార్తలు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అధికార భగ్నప్రేమికుడని సీఎం జగన్మోహన్ రెడ్డి ఎద్దేవా చేసారు. సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో వివిధ అభివృద్ది పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో జగన్ ప్రసంగించారు.
సూపర్ స్టార్ కృష్ణ అస్థికలను కృష్ణానదిలో నిమజ్జనం చేశారు. తండ్రి అస్థికలను నిమజ్జనం చేయడం కోసం ప్రిన్స్ మహేష్ బాబు సహా కుటుంబ సభ్యులు విజయవాడ వెళ్లారు.
ఇటీవల కాలంలో మూవీల ట్రెండ్ మారింది. ఆధ్యాత్మిక భావాలతో ఎక్కువగా చిత్రాలు తెరకెక్కుతున్నాయి. కాగా తాజాగా తేజ సజ్జ హీరోగా హను మాన్ సినిమాను రూపొందించారు 'జాంబీ రెడ్డి' సినిమా దర్శకుడు ప్రశాంత్ వర్మ. అయితే తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు చిత్ర బృందం.
ఢిల్లీలో అత్యంత దారుణంగా హత్యకు గురైన శ్రద్ధవాకర్ హత్యకేసును సినిమాగా తెరకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ హత్య కేసును మూవీగా రూపొందించేందుకు ఇప్పటికే పనులు కూడా మొదలయ్యాయట.
కార్తీక మాసం చివరి వారం కావడంతో యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. దీనితో ఒక్కరోజులో రికార్డు స్థాయి ఆదాయం వచ్చింది.
ఢిల్లీలో శ్రద్ధావాకర్ హత్య జరిగిన కొన్ని రోజుల తర్వాత ఉత్తరప్రదేశ్‌లోని అజంగఢ్‌లో మరో సంచలన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. తన మాజీ ప్రియురాలిని గొంతు కోసి హత్య చేసి, ఆమె తల నరికి, శరీరాన్ని 6 భాగాలుగా నరికిన మాజీ ప్రేమికుడు అరెస్ట్ అయ్యాడు.
కమ్మ వర్గానికి ఎపీ ముఖ్యమంత్రి జగన్ అన్యాయం చేస్తున్నారని, మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు అన్నారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా తాను ఓడిపోయినప్పటికి ఆప్కాబ్ ఛైర్మన్ ఇచ్చారని, అదే విధంగా ఇద్దరు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారికి మంత్రులుగా బాధ్యతలు అప్పగించారని అన్నారు.
ప్రభుత్వం ప్రజలను పట్టించుకోవడం లేదని ఆగ్రహించిన అక్కడి ప్రజలు పరామర్శకు వచ్చిన ఎమ్మెల్యేను చితకబాదారు. ప్రజల బారి నుంచి అతికష్టం మీద ఎమ్మెల్యేను కాపాడి తిరిగి అక్కడి నుంచి పంపించేశారు పోలీసులు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని చిక్కమగళూరులో చోటుచేసుకుంది. అసలు ఎందుకు ఎమ్మెల్యేను ప్రజలు కొట్టాల్సి వచ్చిందో ఈ కథనం ద్వారా చూసేద్దాం.
ఏపీ ప్రభుత్వం విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ పాఠశాలల్లో మెనూ మారనుంది. ప్రస్తుతం పాఠశాలల్లో అమలు చేస్తున్న జగనన్న గోరుముద్ద పథకం మధ్యాహ్న భోజనంలో మార్పులు చేశారు. జగనన్న గోరుముద్ద పథకంలో నేటి నుంచి కొత్త మెనూను అమలు కానుంది.
సీఎం కేసీఆర్ తనకు పితృ సమానులని ఒక్కసారి కాదు వందసార్లు మొక్కుతానని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు అన్నారు. రాష్ట్రంలో కొత్త మెడికల కాలేజీల ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన సీఎం కేసీఆర్ కాళ్లకు నమస్కారం చేయడం పై విమర్శలు వచ్చాయి.