Last Updated:

NZ vs IND: భారత్ మ్యాచ్ వర్షార్పణం.. కివీస్ దే సిరీస్

భారత్ జట్టు న్యూజిల్యాండ్ పర్యటన నిరాశాజనకంగా ముగిసింది. ఆది నుంచి ఈ మ్యాచ్ లకు వరుణుడు ఆటంకంగా మారాడు. కాగా మొదట్లో ఒకటి రెండు మ్యాచ్లు టీమిండియా కైవసం చేసుకోనగా ఆఖరిగి పూర్తి సిరీస్ మాత్రం కివీస్ కైవసం చేసుకుంది.

NZ vs IND: భారత్ మ్యాచ్ వర్షార్పణం.. కివీస్ దే సిరీస్

NZ vs IND: భారత్ జట్టు న్యూజిల్యాండ్ పర్యటన నిరాశాజనకంగా ముగిసింది. ఆది నుంచి ఈ మ్యాచ్ లకు వరుణుడు ఆటంకంగా మారాడు. కాగా మొదట్లో ఒకటి రెండు మ్యాచ్లు టీమిండియా కైవసం చేసుకోనగా ఆఖరిగి పూర్తి సిరీస్ మాత్రం కివీస్ కైవసం చేసుకుంది.

క్రైస్ట్‌చర్చ్‌ వేదికగా నేడు జరిగిన మూడో వన్డే మ్యాచ్ ను వర్షం కారణంగా నిలిపివేశారు. దానితో మూడు వన్డేల సిరీస్‌ న్యూజిలాండ్‌ వశమైంది. దీంతో 1-0తో సిరీస్‌ను న్యూజిలాండ్‌ జట్టు గెలుచుకుంది. మొదటి మ్యాచ్‌లో టీమిండియాపై న్యూజిలాండ్‌ విజయం సాధించగా రెండో వన్డే కూడా వర్షం కారణంగా రద్దయిన విషయం తెలిసిందే. క్రైస్ట్‌చర్చ్‌ వేదికగా ఇవాళ జరిగిన మూడో వన్డేలో టాస్‌ గెలిచిన న్యూజిలాండ్‌ బౌలింగ్‌ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 47.3 ఓవర్లలో 219 పరుగులకు ఆలౌట్‌ అయింది. టీమిండియా కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌ 28 పరుగులు చేయగా వాషింగ్టన్‌ సుందర్‌ 51 చేశారు. ఇక మిగిలిన ప్లేయర్లంతా సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. అత్యధ్బుతంగా రాణిస్తారు అనుకున్న ప్లేయర్స్ అంతా చేతులెత్తేశారు. గిల్‌ 13, అయ్యర్‌ 49, పంత్‌ 10, సూర్యకుమార్‌ 6, దీపక్‌ హుడా 12, , దీపక్‌ చాహర్‌ 12, చాహల్‌ 8, అర్ష్‌దీప్‌ 9 పరుగులు చేసి పెవిలియన్ చేశారు.

220 పరుగలు లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌ జట్టు మైదానంలో చెలరేగి ఆడారు. 18 ఓవర్లు ముగిసే సరికి వికెట్‌ నష్టానికి 104 పరుగులు చేశారు. ఇంతలో వర్షం కురవడంతో మ్యాచ్‌ను నిలిపివేశారు. వర్షం ఎంతకూ తగ్గకపోవడంతో చివరకు మ్యాచ్‌ను రద్దు చేశారు.

ఇదీ చదవండి: ఒకే ఓవర్లో 7 సిక్సులు.. చరిత్ర సృష్టించిన యువ క్రికెటర్

ఇవి కూడా చదవండి: