Last Updated:

Mahesh Babu : “మేము ఫేమస్” మూవీని తెగ పొగిడేస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఏమన్నారంటే ?

ఇటీవల కొన్ని చిన్న చిన్న సినిమాలు మంచి విజయం సాధిస్తున్నాయి. కొత్త దర్శకులు మంచి సినిమాలతో వచ్చి హిట్స్ కొడుతున్నారు. యూట్యూబర్ సుమంత్ ప్రభాస్ హీరోగా, దర్శకుడిగా తెరకెక్కిన సినిమా "మేము ఫేమస్". ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్, ట్రైలర్స్ తో సినిమాపై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. తెలంగాణ నేటివిటీలో

Mahesh Babu : “మేము ఫేమస్” మూవీని తెగ పొగిడేస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఏమన్నారంటే ?

Mahesh Babu : ఇటీవల కొన్ని చిన్న చిన్న సినిమాలు మంచి విజయం సాధిస్తున్నాయి. కొత్త దర్శకులు మంచి సినిమాలతో వచ్చి హిట్స్ కొడుతున్నారు. యూట్యూబర్ సుమంత్ ప్రభాస్ హీరోగా, దర్శకుడిగా తెరకెక్కిన సినిమా “మేము ఫేమస్”. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్, ట్రైలర్స్ తో సినిమాపై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. తెలంగాణ నేటివిటీలో వస్తుండటంతో ముఖ్యంగా తెలంగాణలో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మణి ఏగుర్ల, మౌర్య చౌదరి, సార్య, సిరి రాశి తదితరులు ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి కళ్యాణ్ నాయక్ సంగీతం సమకూర్చగా.. చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ & లహరి ఫిల్మ్స్ బ్యానర్స్ పై అనురాగ్ రెడ్డి, శరత్ చంద్రు, మనోహరన్ సంయుక్తంగా నిర్మించారు.

కాగా రిలీజ్ మే 26న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. దాంతో ప్రమోషన్స్ లో మరింత స్పీడ్ పెంచారు. ఈ క్రమంలోనే చిత్ర యూనిట్ డిఫరెంట్ గా ప్రమోషన్స్ చేస్తూ అందర్నీ ఆకర్షిస్తున్నారు. వీళ్ళ ప్రమోషన్స్ లో ఇప్పటికే పలువురు హీరోలు, హీరోయిన్స్, డైరెక్టర్స్, యాక్టర్స్ పాల్గొన్నారు. చిన్న సినిమా అయినా కానీ చాయ్ బిస్కెట్ ఫిలిమ్స్ నిర్మిస్తుండటంతో పెద్ద స్టార్స్ ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారని తెలుస్తుంది. అయితే ఇప్పటికే ఈ సినిమాను కొంతమంది ప్రముఖులు చూసి అభినందిస్తున్నారు. ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా మేము ఫేమస్ సినిమా చూసి అభినందిస్తూ ట్వీట్ చేశారు.

ఈ మేరకు మహేష్ బాబు (Mahesh Babu) తన ట్విట్టర్ లో.. ”ఇప్పుడే #MemFamous సినిమా చూసాను! ఇదొక అద్భుతమైన చిత్రం!! సినిమాలోని ప్రతి నటీనటుల పెర్ఫార్మన్స్ కు ఫిదా అయిపోయాను. ముఖ్యంగా రచయిత, దర్శకుడు, నటుడు సుమంత్ ప్రభాస్ ఎంతో ప్రతిభ కలవాడు. విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సహా అన్ని క్రాఫ్ట్స్ పర్ఫెక్ట్ గా కుదిరాయి. కొంత మంది డెబ్యూటెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మించారని నమ్మలేకపోతున్నా. ఈ సినిమా తీసినందుకు నిర్మాతలు శరత్ చంద్ర, అనురాగ్ రెడ్డి , యువ బృందానికి నా అభినందనలు. మీరు ఇలాంటి టాలెంట్‌ కి మద్దతుగా నిలిచినందుకు గర్వంగా ఉంది” అని అన్నారు.  ఇక మహేష్ బాబు ఈ మూవీ గురించి ట్వీట్ చేయడం మరింత బూస్ట్ ని ఇచ్చింది అని చెప్పాలి.

అయితే మహేష్ చేసిన ట్వీట్ కి నిర్మాత శరత్ థ్యాంక్స్ చెప్తూ ట్వీట్ చేసి.. సుమంత్ ప్రభాస్ తో మరో సినిమా చేస్తున్నాం, ఈ సినిమాకు మీరు ప్రొడ్యూస్ చేస్తారా అని అడగడంతో మహేష్ ఆ ట్వీట్ కి రిప్లై ఇస్తూ.. కచ్చితంగా చేస్తాను, GMB ఎంటర్టైన్మెంట్ ఇలాంటి కొత్త ట్యాలెంట్ ఎంకరేజ్ చేయడంలో హ్యాపీగా ఉంటుంది అని ట్వీట్ చేశారు. దీంతో సుమంత్ ప్రభాస్ సినిమా రిలిజ్ అవ్వకుండానే మహేష్ బాబు నిర్మాణంలో సినిమా ఛాన్స్ పట్టేశాడు అని అందరూ అభినందిస్తున్నారు. గతంలో చాయ్ బిస్కెట్ నిర్మాతలు, మహేష్ బాబు కలిసి అడివి శేష్ హీరోగా మేజర్ సినిమాని తెరకెక్కించారు.