Justice Chandrachud: సుప్రీం సీజేఐగా జస్టిస్ చంద్రచూడ్ ప్రమాణ స్వీకారం
సుప్రీంకోర్టు 50వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధనుంజయ్ యశ్వంత్ చంద్రచూడ్ ప్రమాణస్వీకారం చేశారు. నేడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో సుప్రీం ఛీఫ్ జస్టిస్ గా ప్రమాణం చేయించారు. ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రితోపాటు పలువురు కేంద్రమంత్రులు మరియు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
Justice Chandrachud: సుప్రీంకోర్టు 50వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధనుంజయ్ యశ్వంత్ చంద్రచూడ్ ప్రమాణస్వీకారం చేశారు. నేడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో సుప్రీం ఛీఫ్ జస్టిస్ గా ప్రమాణం చేయించారు. ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రితోపాటు పలువురు కేంద్రమంత్రులు మరియు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
44 ఏళ్ల క్రితం చంద్రచూడ్ తండ్రి అయిన జస్టిస్ యశ్వంత్ విష్ణు చంద్రచూడ్ సుప్రీం ప్రధాన న్యాయమూర్తిగా ఫిబ్రవరి 22, 1978 నుంచి జూలై 11, 1985 వరకు ఎక్కువ కాలం పాటు దేశానికి విశిష్ట సేవలందించారు. ఇప్పుడు ఆయన తనయుడు ఈ అత్యున్నత పీఠాన్ని అధిరోహించారు. కాగా చంద్రచూడ్ నేటి నుంచి 2024 నవంబర్ 10వ తేదీ వరకు ఈ పదవిలో కొనసాగనున్నారు. 1959 నవంబర్ 11వ తేదీన జస్టిస్ డీవై చంద్రచూడ్ జన్మించారు. తన ఉన్నతవిద్య మరియు గ్రాడ్యుయేషన్ డిగ్రీ అంతా ఢిల్లీలోనే పూర్తిచేశారు.
ఇదీ చదవండి దేశంలోనే తొలి ప్రైవేట్ రాకెట్.. అంతరిక్షం వరకు హైదరాబాద్ ఖ్యాతి