Fire Accident: ఏపీలో భారీ పేలుడు.. నలుగురు దుర్మరణం
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం కడియద్ద గ్రామంలో గురువారం రాత్రి ఘోర ప్రమాదం సంభవించింది. బాణాసంచా తయారయ్యే ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందగా పలువురిగి గాయాలయ్యాయి.
Fire Accident: పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం కడియద్ద గ్రామంలో గురువారం రాత్రి ఘోర ప్రమాదం సంభవించింది. బాణాసంచా తయారయ్యే ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందగా పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 10లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ఈ దుర్ఘటనలో గాయపడిన వారికి మెరుగైన వైద్య సహాయం అందించాలని జిల్లా కలెక్టర్కు ఆయన ఆదేశాలు జారీ చేశారు.
పరిశ్రమలో ఒక్కసారిగా బాణాసంచా పేలుడు శబ్ధం విన్న గ్రామస్తులు వెంటనే అక్కడికి చేరుకున్నప్పటికీ ఫ్యాక్టరీలో మరింత బాణాసంచా నిల్వ ఉందని ఆ పరిశ్రమ వైపు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. స్థానికులు అందించిన సమాచారంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న తాడేపల్లిగూడెం పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.
ఇదీ చదవండి: ఢిల్లీ లిక్కర్ స్కాం.. అరబిందో ఫార్మా డైరెక్టర్ అరెస్ట్