Last Updated:

Devarayanjal lands: దేవరయాంజాల్ భూములు ప్రభుత్వానివే.. తేల్చేసిన కమిటీ

మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలోని దేవరయాంజాల్ భూములు ప్రభుత్వానివే అంటూ వీటిపై ఏర్పాటయిన కమిటీ స్పష్టం చేసింది.

Devarayanjal lands: దేవరయాంజాల్ భూములు ప్రభుత్వానివే.. తేల్చేసిన కమిటీ

Devarayanjal lands: మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలోని దేవరయాంజాల్ భూములు ప్రభుత్వానివే అంటూ వీటిపై ఏర్పాటయిన కమిటీ స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదికను అందజేసింది. ఈ భూములు దేవాదాయధర్మాదాయ శాఖకు చెందినవిగా కమిటీ తేల్చింది.

దేవరయాంజాల్ లో గల శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయం భూముల ఆక్రమణలపై తెలంగాణ ప్రభుత్వం సరిగ్గా ఏడాదిన్నర క్రితం ఓ కమిటీని నియమించింది.ఆ కమిటీకి పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ రఘునందన్‌రావు నేతృత్వం వహించారు. అందులో నల్గొండ, మేడ్చల్‌ మల్కాజ్ గిరి, మంచిర్యాల జిల్లాల కలెక్టర్లు సభ్యులుగా ఉన్నారు. వీరితో ప్రత్యేకంగా ప్రభుత్వం దేవరయాంజాల్ భూముల విచారణ కోసం కమిటీని నియమించింది.

గత ఏడాది కేసీఆర్ క్యాబినెట్లో మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ టీఆర్ఎస్ ను వీడి బయటకు వచ్చాక ఈ భూములపై వివాదం బయటకు వచ్చింది. ఈటల రాజేందర్ భూములను ఆక్రమించి గోదాములు నిర్మించుకున్నారని పలువురు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు.

ఇవి కూడా చదవండి: