Last Updated:

Zoom Layoffs: మరో అరగంటలో ఈ మెయిల్ వస్తుందంటూ.. లే ఆఫ్స్ బాంబ్ పేల్చిన జూమ్

ఉద్యోగాల కోత విధిస్తున్న టెక్ కంపెనీల జాబితాలోకి తాజాగా జూమ్ (Zomm) వచ్చి చేరింది. కరోనా టైమ్ లో టెక్ కంపెనీలు భారీ గా నియామకాలు చేసుకున్నాయి.

Zoom Layoffs: మరో అరగంటలో ఈ మెయిల్ వస్తుందంటూ.. లే ఆఫ్స్ బాంబ్ పేల్చిన జూమ్

Zoom Layoffs: ఉద్యోగాల కోత విధిస్తున్న టెక్ కంపెనీల జాబితాలోకి తాజాగా జూమ్ (Zomm) వచ్చి చేరింది. కరోనా టైమ్ లో టెక్ కంపెనీలు భారీ గా నియామకాలు చేసుకున్నాయి.

కానీ సాధారణ పరిస్థితికి రావడం, వర్క్ ఫ్రం హోమ్ లు తగ్గడంలో అనేక కంపెనీల రెవెన్యూలు తగ్గాయి. ఈ క్రమంలో కంపెనీల నిర్వహణలో ఇబ్బందులు తలెత్తాయి.

ఈ నేపధ్యంలో వీడియో కమ్యూనికేషన్ టెక్నాలజీ సంస్థ జూమ్ భారీగా ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది.

సంస్థలోని 15 శాతం మందిని అంటే 1300 మందిని ఇంటికి పంపుతోంది జూమ్. ఈ విషయాన్ని సంస్థ సీఈవో ఎరిక్ యువాన్ కంపెనీ అధికారిక బ్లాగ్ లో వెల్లడించారు.

లేఆఫ్స్ కు ఎఫెక్ట్ అయిన ఉద్యోగులు మంది ప్రతిభావంతులు, కష్టపడే తత్వం ఉన్న వ్యక్తులని ఆయన పేర్కొన్నారు.

నిబంధనలకు అనుగుణంగా

‘ఉద్యోగాలు తొలగిస్తున్న జాబితాలో అమెరికాలో పనిచేసే వారికి మరో అరగంటలో ఈ మెయిల్ వస్తుంది.

ఇక అమెరికా బయట పనిచేస్తున్న వారికి స్థానిక నిబంధనలకు అనుగుణంగా ప్రాసెస్ జరుగుతుంది.

అమెరికాలో ఉద్యోగం కోల్పోతున్న వారికి చట్ట ప్రకారం 16 వారాల జీతం, హెల్త్ కేర్ సదుపాయం,

2023 ఆర్థిక సంవత్సరానికి ప్రతిభ ఆధారంగా బోనస్, 6 నెలల పాటు స్టాక్ ఆప్షన్ పై అధికారం ఇస్తున్నాం.

అమెరికా బయట ఉద్యోగులకు ఆగష్టు 9 వ తేదీ వరకు సమయం ఉంటుంది.’ అని ఎరిక్ బ్లాగ్ రాసుకొచ్చారు.

కొవిడ్ సమయంలో జూమ్ కంపెనీ కి డిమాండ్ పెరిగిందని .. అందుకే ఎక్కువగా నియామకాలు చేపట్టామని సీఈఓ తెలిపారు.

24 నెలల్లో జూమ్ సంస్థ 3 రెట్లు పెరింగిందన్నారు. సంస్థ దీర్ఘకాల భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని కఠిన నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు.

ఉద్యోగల కోత సమాచారం అందించాల్సి వస్తున్నందుకు తనను క్షమించాలని ఆయన కోరారు.

 

98 శాతం కోత విధించుకున్న సీఈఓ

మరో వైపు ఖర్చును తగ్గించేందుకు జూమ్ సీఈఓ కీలక నిర్ణయం తీసుకున్నారు.

వచ్చే ఆర్థిక సంవత్సరంలో తన వేతనంలో 98 శాతం కోత విధించుకునేందుకు నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు.

ప్రస్తుత పరిస్థితికి పూర్తి బాధ్యత వహిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. అదే విధంగా 2023 లో కార్పొరేట్ బోనస్ ను కూడా వదులు కుంటున్నాని చెప్పారు.

కంపెనీ ఎగ్జిక్యూటివ్ టీమ్ కూడా తమ జీతాల్లో 20 శాతం తగ్గించుకున్నట్టు వెల్లడించారు.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/