Last Updated:

UK Chef Visas: బ్రిటన్‌ చెఫ్‌ వీసాలకు భలే డిమాండ్‌..ఎందుకో తెలుసా?

బ్రిటన్‌లో ఇమ్మిగ్రేషన్‌ పాలసీలో మార్పులు చోటు చేసుకోవడంతో ఐటి నిపుణుల కంటే చెఫ్‌ల నుంచి దరఖాస్తులు ఎక్కువగా వస్తున్నాయి. ఈ ఏడాది బ్రిటన్‌ డిపెండెంట్స్‌ వీసాలను నిలిపివేసింది.

UK Chef Visas: బ్రిటన్‌ చెఫ్‌ వీసాలకు భలే డిమాండ్‌..ఎందుకో తెలుసా?

UK Chef Visas: బ్రిటన్‌లో ఇమ్మిగ్రేషన్‌ పాలసీలో మార్పులు చోటు చేసుకోవడంతో ఐటి నిపుణుల కంటే చెఫ్‌ల నుంచి దరఖాస్తులు ఎక్కువగా వస్తున్నాయి. ఈ ఏడాది బ్రిటన్‌ డిపెండెంట్స్‌ వీసాలను నిలిపివేసింది. కాగా బ్రిటన్‌కు ఒక విద్యార్థి చదువుకోవడానికి స్టూడెంట్‌ వీసాపై వెళితే.. అతని వెంట వెళ్లేవారికి డిపెండెంట్‌కు వీసా ఇచ్చే వారు. ఈ డిపెండెంట్‌ అక్కడ ఉద్యోగం చేసుకొనే వెసులు బాటు ఉండేది. ప్రస్తుతం బ్రిటన్‌ ఆర్థికంగా చితికిపోయింది. దీంతో బ్రిటన్‌ ప్రభుత్వం డిపెండెంట్‌ వీసాలను రద్దు చేసింది. అయితే బ్రిటన్‌ డిజిటల్‌ సూపర్‌ పవర్‌ కావాలనుకుంటే పెద్ద మొత్తంలో చెఫ్‌లు రావడంతో ప్రభుత్వం కంగు తింటోంది.

54 శాతం పెరుగుదల..(UK Chef Visas)

ఇక్కడి ఫైనాన్షియల్‌ టైమ్స్‌ విడుదల చేసిన తాజా నివేదక ప్రకారం చూస్తే మార్చి 2024 నాటికి చూస్తే 6,203 మంది చెఫ్‌లకు వీసాలు ఇచ్చారు. గత ఏడాదితో పోల్చుకుంటే 54 శాతం పెరిగాయి. అదే స్టాప్‌వేర్‌ ప్రోగ్రామర్స్‌ విషయానికి వస్తే 4,280కి దిగివచ్చాయి. గత ఏడాది ఇదే స్టాప్‌వేర్‌ ప్రోగ్రామర్లకు 8,752 వీసాలు ఇచ్చింది బ్రిటన్‌ సర్కార్‌. అయితే ఇక్కడికి వచ్చే వలసదార్లలో ఎక్కువగా ఇండియన్స్‌ ఉంటున్నారు. ఇక్కడి ఇండియన్‌ రెస్టారెంట్‌ ఇండస్ర్టీ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఇండియా నుంచి పెద్ద ఎత్తున చెఫ్‌లను తేవాలని మొరపెట్టుకున్నట్లు చెబుతున్నారు. కాగా బ్రిటన్‌లో ఇండియన్‌ డిష్‌లు ప్రధానంగా చికెన్‌ టిక్కా మసాలా బాగా పాపులర్‌…. బ్రిటన్‌ ఫేవరేట్‌ డిష్ కూడా‌. దీంతో ప్రభుత్వం కూడా హోటల్‌ ఇండస్ర్టీ డిమాండ్‌కు తల ఒగ్గిందనే టాక్‌ వినిపిస్తోంది.

చెఫ్‌ల దరఖాస్తులు పెరిగే అవకాశం..

ఇక సిల్క్డ్‌ వర్కర్స్‌ బ్రాకెట్‌లో చెఫ్‌లకు అతి తక్కువ వేతనం లభిస్తోంది. కాగా బ్రిటన్‌ కనీస వేతనం ఏడాదికి 30,960 పౌండ్ల నుంచి 38,700 పౌండ్లకు పెంచాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. గత ఏడాది ఏప్రిల్‌లో బ్రిటన్‌ ఇదే చెఫ్‌ల వేతనం 22,877 పౌండ్లు మాత్రమే. అయితే బ్రిటన్‌లో ఉన్న చాలా రెస్టారెంట్లు కొత్తగా సవరించే వేతనాలు చెల్లించలేని పరిస్థితిలో ఉన్నాయి. అయితే కొత్తగా సవరించిన వేతనాల వల్ల ఇండియా నుంచి చెఫ్‌ల దరఖాస్తుల పెరిగే అవకాశం ఉంది. ఇక్కడ చెఫ్‌లకు 30,960 పౌండ్లు అంటే భారతీయ కరెన్సీ ప్రకారం రూ.41,02,200గా చెప్పుకోవచ్చు. ఈ లెక్కన చూస్తే నెలకు సుమారు రూ.3 .41 లక్షలు గిట్టుబాటు అవుతున్న నేపధ్యంలో ఇండియా నుంచి వీసాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఇమ్మిగ్రేషన్‌ అధికారులు భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి: