Shakib Al Hasan: టీమిండియాపై బంగ్లా స్పిన్నర్ అరుదైన రికార్డ్.. 36 పరుగులు, 5 వికెట్లు..!
బంగ్లాదేశ్ టీమిండియా మధ్య వన్డే టెస్ట్ సీరీస్ నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే బంగ్లా పర్యటనను టీమ్‌ఇండియా ఓటమితో ప్రారంభించింది. ఇరు జట్ల మధ్య ఆదివారం జరిగిన పోరులో భారత్‌పై బంగ్లాదేశ్ ఒక వికెట్ తేడాతో విజయం సాధించింది. వన్డేల్లో టీమ్‌ఇండియాపై ఐదు వికెట్ల ప్రదర్శన చేసిన తొలి బంగ్లా స్పిన్నర్‌గా రికార్డు సృష్టించాడు.
Shakib Al Hasan: బంగ్లాదేశ్ టీమిండియా మధ్య వన్డే టెస్ట్ సీరీస్ నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే బంగ్లా పర్యటనను టీమ్‌ఇండియా ఓటమితో ప్రారంభించింది. ఇరు జట్ల మధ్య ఆదివారం జరిగిన పోరులో భారత్‌పై బంగ్లాదేశ్ ఒక వికెట్ తేడాతో విజయం సాధించింది. ఈ మూడు వన్డేల సిరీస్‌లో బంగ్లా 1-0 తేడాతో భారత్ పై ఆధిక్యం సంపాదించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్‌ఇండియా 41.2 ఓవర్లలో అతి తక్కువ పరుగులతో 186 ఆలౌట్ కాగా.. ఈ లక్ష్యాన్ని బంగ్లాదేశ్ 9 వికెట్లు కోల్పోయి 46 ఓవర్లలో ఛేదించింది. భారత్‌ని తక్కువ స్కోరుకు కట్టడి చేయడంలో బంగ్లా ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ కీలక పాత్ర పోషించాడనే చెప్పాలి. 10 ఓవర్లు బౌలింగ్ చేసి 36 పరుగులే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ఇందులో రెండు మెయిడిన్‌లు ఉండటం విశేషం. కీలకమైన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను కూడా షకీబే పెవిలియన్ చేర్చాడు.
షకీబ్ అల్ హసన్ ఈ మ్యాచ్‌లో 5 వికెట్లు పడగొట్టడం ద్వారా భారత్‌పై రికార్డు సృష్టించాడు. వన్డేల్లో టీమ్‌ఇండియాపై ఐదు వికెట్ల ప్రదర్శన చేసిన తొలి బంగ్లా స్పిన్నర్‌గా రికార్డు సృష్టించాడు. ఓవరాల్‌గా భారత జట్టుపై ఈ ఫీట్ సాధించిన ఎనిమిదో స్పిన్నర్‌గా షకీబ్ నిలిచాడు. గతంలో ముస్తాక్ అహ్మద్, సక్లైన్ ముస్తాక్, ముత్తయ్య మురళీధరన్, యాష్లే గైల్స్, అజంతా మెండిస్, సయీద్ అజ్మల్, అకిల ధనంజయ వన్డేల్లో భారత్‌పై ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశారు. బంగ్లాదేశ్, భారత్ మధ్య డిసెంబర్ 7న రెండో వన్డే జరగనుంది.
ఇదీ చదవండి: టీమిండియాకు పంత్ దూరం.. బీసీసీఐ ప్రకటన