Last Updated:

Thotakura: తోటకూర తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే..

ఆకుకూరలు శరీరానికి అవసరమై అనేక రకాల పోషకాలను పుష్కలంగా అందిస్తాయి. మరీ ముఖ్యంగా మనకు అత్యధికంగా అందరికీ అందుబాటులో ఉన్న ఆకుకూరల్లో మొదటగా అందరికీ గుర్తొచ్చేది తోటకూర. వంద గ్రాముల తోట కూరను ఆహారంగా తీసుకోవడం వల్ల దాదాపు 716 క్యాలరీల శక్తి శరీరానికి అందుతుందని

Thotakura: తోటకూర తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే..

Thotakura: ఆకుకూరలు శరీరానికి అవసరమై అనేక రకాల పోషకాలను పుష్కలంగా అందిస్తాయి. మరీ ముఖ్యంగా మనకు అత్యధికంగా అందరికీ అందుబాటులో ఉన్న ఆకుకూరల్లో మొదటగా అందరికీ గుర్తొచ్చేది తోటకూర. వంద గ్రాముల తోట కూరను ఆహారంగా తీసుకోవడం వల్ల దాదాపు 716 క్యాలరీల శక్తి శరీరానికి అందుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తోట కూరలో అధికంగా పీచుతో పాటు కార్బొహైడ్రేట్లు, ప్రొటీన్లు, తక్కువ కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. అందుకే చాలా మంది తోటకూరను రకరకాలు వండుకని ఆహారంగా తీసుకుంటారు. అయితే, తోట కురను వేపుడు చేసుకునే తినడం కంటే వండుకుని తినడం వల్ల ప్రయోజనాలు అధికంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

తోటకూర తినడం వల్ల శరీరానికి కలిగే ప్రయోజనాల గురించి వైద్యారోగ్య నిపుణులు వెల్లడించిన వివరాల ప్రకారం తోట కూరకు ఉండే ప్రత్యేక లక్షణం కారణంగా నిత్యం దీనిని తినడం వల్ల అధిక బరువు ఉండే వారు సులభంగా బరువును తగ్గించుకోవచ్చు. తోటకూరలో అనేక రకాలు విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. తోటకూరలో కంటి చూపును మెరుగు పరిచే విటమిన్ ఏ తో పాటు సీ విటమిన్, డీ విటమిన్, ఈ విటమిన్, కే విటమిన్, విటమిన్ బీ-12, విటమిన్ బీ-6 వంటివి వుంటాయి. కాబట్టి ఒక్క తోటకూరతో శరీరానికి అవసరమైన అన్ని మిటమిన్లు అందుతాయి.

తోట కూర తినడం వల్ల మానసిక అనారోగ్య సమస్యలు సైతం తగ్గిపోవడంతో పాటు వాటిని రానీయకుండా ప్రభావం చూపుతుంది. హైపర్ టెన్షన్ తో బాధపడే వారికి తోటకూర ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అధిక రక్త పోటును సైత తగ్గిస్తుంది. రక్తప్రసరణ వ్యవస్థ మెరుగుదలకు తోడ్పడుతుంది. తోటకూరలో ఉంటే విటమిన్ సీ కారణంగా అనేక వ్యాధులను తట్టుకునే రోగ నిరోధక వ్యవస్థ శరీరంలో ఏర్పడుతుంది. తోటకూరలో అన్ని రకాల విటమిన్ల తో పాటు మెగ్నీషియం, పాస్ఫరస్, కాల్షియం, ఇనుము, జింక్, కాపర్, సెలీనియం, మాంగనీస్ వంటి ఖనిజాలన్నీ తోటకూరలో ఉంటాయి. కాబట్టి శరీరానికి అవసరమైన సూక్ష్మపోషకాలు అందుతాయి. అందువల్ల మన ఆహారంలో తోటకూరను భాగంగా చేసుకుంటే ఈ ప్రయోజనాలను పొందవచ్చు.

ఇవి కూడా చదవండి: