Naga Vamsi: దమ్ముంటే నా సినిమాలు బ్యాన్ చేయండి.. రివ్యూలు రాయకండి

Naga Vamsi: టాలీవుడ్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు అని తేడా లేకుండా వరుస సినిమాలతో టాలీవుడ్ లో హిట్స్ అందుకుంటున్నాడు. ఇక నాగవంశీ ముక్కుసూటి మనిషి. ఏ విషయం గురించి అయినా మనసులో ఏది పెట్టుకోకుండా నిర్మొహమాటంగా అందరి ముందు మాట్లాడేస్తాడు. దీని వలన అతనిపై ఎన్నో విమర్శలు వచ్చాయి.
ఇంకొంతమంది నాగవంశీకి పొగరు అని కూడా చెప్పుకొచ్చారు. అయినా కూడా నాగవంశీ ఎక్కడా తగ్గేదేలే అంటూ తన మనసుకు ఏది అనిపిస్తే అది ఆనిస్తూ ఉంటాడు. ఇక ఈ మధ్యనే నాగవంశీ నిర్మాణంలో మ్యాడ్ స్క్వేర్ సినిమా రిలీజ్ అయ్యి మంచి పాజిటివ్ టాక్ ను అందుకుంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది. కథ లేదని, సీక్వెల్ అడ్వాంటైజ్ అని.. ఇలా నెగిటివ్ రివ్యూలు ఇచ్చారు. ఇక ఈ నెగిటివ్ రివ్యూలపై నాగవంశీ ఫైర్ అయ్యాడు.
తాజాగా ఒక ప్రెస్ మీట్ పెట్టి.. అందరికీ ఇచ్చి పడేశాడు. ” ఎలా ఉన్నా చూడడానికి ఇదేమి బాహుబలి 2, పుష్ప2, కెజిఎఫ్ 2 కాదు. వీరేమి స్టార్ హీరోస్ కాదు. వేరే సినిమా బాగోలేదని మా సినిమాకు రాలేదు. కోర్ట్ సినిమా బావుందని వెళ్లారు. మిగతా సినిమాలు బాలేదని వెళ్ళలేదు. మ్యాడ్ స్క్వేర్ బావుందని వచ్చారు. వేరే సినిమా బాగోలేదని కాదు. మీకు అంతగా మా మీద పగ ఉంటే నా సినిమాలు బ్యాన్ చేయండి.
నేను ఇన్ని కామెంట్స్ చేశా కదా.. దమ్ముంటే నా సినిమాలు బ్యాన్ చేయండి.. నా సినిమాకు రివ్యూలు రాయకండి. ఆర్టికల్స్ రాయకండి.. నా దగ్గర యాడ్స్ తీసుకోకండి. నాకేమి అవసరం లేదు. మమ్మల్ని బ్యాన్ చేయండి చూస్తా నేను. నేను ఇప్పుడు చెప్తున్నా.. నా సినిమాకు రివ్యూలు రాయకండి. ఆర్టికల్స్ రాయకండి.. నా దగ్గర యాడ్స్ తీసుకోకండి.. నా సినిమా ప్రమోషన్స్ నేను చేసుకుంటా. మీరు వెబ్ సైట్ లో ప్రమోట్ చేస్తేనే సినిమాలు ఆడడం లేదు కదా. సినిమాను చంపకండి. కంటెంట్ లేకుండా సినిమా ఎందుకు హిట్ అయ్యిందో.. ప్లాప్ అయ్యిందో అని తీర్పులు ఇవ్వకండి” అంటూ మండిపడ్డాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.