Last Updated:

Allu Arjun- Trivikram: కుమారస్వామిగా బన్నీ.. నిజం చెప్పేసిన నాగవంశీ

Allu Arjun- Trivikram: కుమారస్వామిగా బన్నీ.. నిజం చెప్పేసిన నాగవంశీ

Allu Arjun- Trivikram: పుష్ప 2 తరువాత అల్లు అర్జున్.. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెల్సిందే. బన్నీ – త్రివిక్రమ్ కాంబోకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందనే చెప్పాలి.ఇప్పటికే  వీరి కాంబోలో మూడు సినిమాలు వచ్చాయి. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురంలో.. ఈ మూడు సినిమాలు బ్లాక్  బస్టర్ అయ్యాయి. ఇక ఇప్పుడు వీరి కాంబోలో నాలుగో సినిమా వస్తుండడంతో ఫ్యాన్స్ ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు.

 

ఇక ఎప్పుడెప్పుడు  ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందా  అని అభిమానులు ఎంతో ఆత్రుతగా  ఎదురుచూస్తున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం మైథలాజికల్ జోనర్ లో గురూజీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా ఆయన సినిమాల్లో ఎక్కడో ఒక చోట పురాణానికి సంబంధించిన డైలాగ్ లు ఖచ్చితంగా ఉంటాయి. అలాంటిది.. ఏకంగా పురాణాల్లోని ఒక కథనే సినిమాగా తీస్తున్నాడు అంటే  ఫ్యాన్స్ అంచనాలు పెట్టుకోవడంలో తప్పే లేదు.

 

ఇప్పటివరకు ఏ డైరెక్టర్ టచ్ చేయని కుమారస్వామి కథను త్రివిక్రమ్ తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. శివపార్వతుల ముద్దుబిడ్డ కుమారస్వామిగా బన్నీ కనిపించనున్నాడని అంటున్నారు. అయితే ఇప్పటివరకు ఇది కేవలం పుకార్లు అని మాత్రమే అనుకున్నారు. కానీ, తాజాగా  నిర్మాత సూర్యదేవర నాగవంశీ సైతం ఈ సినిమా మైథలాజికల్ జోనర్ అని చెప్పడంతో ఫ్యాన్స్ కన్ఫర్మ్ చేసేశారు.

 

మ్యాడ్ స్క్వేర్ ప్రెస్ మీట్ లో   సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ.. బన్నీ – త్రివిక్రమ్ సినిమా మైథలాజికల్ జోనర్ లోనే ఉంటుంది. కొందరు సోషియో ఫాంటసీ అంటున్నారు. కాదు ఇది పూర్తిగా పురాణాల నుంచి తీసుకున్న కథ. అక్టోబర్ నుంచి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుంది అని చెప్పుకొచ్చాడు. దీంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

 

ఇక ఈ విషయం తెలియడంతో అల్లు అభిమానులు బన్నీని కుమారస్వామిగా ఊహించేసుకొని ఎడిటింగ్ ఫొటోలతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి ఈ కాంబో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

ఇవి కూడా చదవండి: