Singh a Song in Hari Hara Veeramallu: జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలకు కాస్తా బ్రేక్ ఇచ్చి సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇటీవల ఆయన తిరిగి సినిమా షూటింగ్‌లో పాల్గొన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన హరిహర వీరమల్లు సెట్లో సందడి చేస్తున్నారు. ఆయన చేతిలో మూడు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. కానీ అందులో ఎక్కువగా క్రేజ్ సంపాదించుకుంది ఓజీ మూవీ. సాహో ఫేం సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మొదటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి.
అయితే ప్రస్తుతం పవన్ లేకుండానే ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది. ఇదిలా ఉంటే వచ్చే ఏడాది మార్చిలో హరిహర వీరమల్లు రిలీజ్ సందర్భంగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి సంబంధించిన ఓ క్రేజీ అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పీరియాడికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో పవన్ పోరాట యోధుడిగా కనిపించబోతున్నాడు. అయితే ఈ సినిమాలో యాక్షన్‌తో పాటు గాత్రం కూడా చేయబోతున్నాడట.
అవును హరిహర వీరమల్లు ఈ పవన్ స్వయంగా ఓ పాట పాడబోతున్నారట. ఇప్పటికే పవన్ తన ప్రతి సినిమాల్లో తన స్వయంగా పాటలు పాడారు. ఇప్పుడు హరహర వీరమల్లులోనూ ఓ సాంగ్ పాడుతున్నారని టాక్. శ్రీకాకుళం యాసలో ఈ పాట ఉంటుందట. గతంలో పవన్ ఖుషి, జానీ, తమ్ముడు వంటి చిత్రాల్లో పాడాడు. మూవీలో పవన్ పాట పడే స్కోప్ ఉండడంతో ఆయన ఆ పాట పాడేందుకు సిద్ధమయ్యారు. ఇందుకు సంబంధించిన అప్‌డేట్ ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఇది తెలిసి పవర్ స్టార్, మెగా అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. గతంలో పవన్ పాడిన పాటలు మంచి క్రేజ్ సంపాదించుకున్నాయి. అవి మంచి హిట్ కూడా అయ్యాయి.
‘తమ్ముడు’లో.. ఎమ్ పిల్ల మాటాడవా, తాటి చెట్టు ఎక్కలేడు.. తాటి కల్లు తాగలేడు; ‘ఖుషి’లో.. బైబైయే బంగారు రమణమ్మ; ‘జానీ’లో… నువ్వు సారా తాగుట, రావోయి మా ఇంటికి; ‘పంజా’లో… పాపారాయుడు; ‘అత్తారింటికి దారేది’లో కాటమ రాయుడా, కదిలే నరసింహుడా; అలాగే అజ్ఞాతవాసిలో.. కొడకా కోటేశ్వర్ రావు పాటలు పాడారు. అంతేకాదు జనసేన పార్టీకి కోసం ఓ ప్రైవేట్ అల్భం సాంగ్ కూడా పాడారు. అదే రాజులకి రాజు పోతురాజు.. పాట. ఇలా యాక్షింగ్, యాక్షన్‌తోనే కాదు తన గాత్రంతో ఆడియన్స్ అలరిస్తున్నారు ఈ పవర్ స్టార్. ఇక హరిహర వీరమల్లు మూవీ విషయానికొస్తే.. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా, ఫేమస్ బాలీవుడ్ యాక్టర్ బాబీ డియోల్, అనుపమ్ ఖేర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వీరితో పాటు సునీల్, జయ్ రామ్, మహేష్ మంజ్రేకర్, అనసూయ తదితరులు యాక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు గ్రహిత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.