Last Updated:

Ramarao on Duty : త్వరలో ఓటీటీలో సందడి చేయనున్న రామారావు ఆన్ డ్యూటీ సినిమా

తెలుగు చిత్ర పరిశ్రమలో రవితేజకు ఉన్న క్రేజే వేరు . అందరు మాస్ మహారాజా అని పిలుచుకుంటారు. రవి తేజ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘రామారావు ఆన్ డ్యూటీ’. ఈ సినిమా జూలై 29న థియేటర్లో సందడి చేసింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో తొందరలో విడుదల అవ్వబోతుంది .సెప్టెంబరు నెలలో స్ట్రీమింగ్ అవ్వనుంది.

Ramarao on Duty : త్వరలో ఓటీటీలో సందడి చేయనున్న రామారావు ఆన్ డ్యూటీ  సినిమా

Ramrarao on Duty :తెలుగు చిత్ర పరిశ్రమలో రవితేజకు ఉన్న క్రేజే వేరు . అందరు మాస్ మహారాజా అని పిలుచుకుంటారు. రవి తేజ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘రామారావు ఆన్ డ్యూటీ’. ఈ సినిమా జూలై 29న థియేటర్లో సందడి చేసింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో తొందరలో విడుదల అవ్వబోతుంది .సెప్టెంబరు నెలలో స్ట్రీమింగ్ అవ్వనుంది.

ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడింది . అనుకున్న అంచనాలను అందుకోలేకపోయింది. ఇక మొత్తం మీద ఈ సినిమా కలెక్షన్స్ చూసుకుంటే మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో 2.82 కోట్ల షేర్‌ను మాత్రమే వసూలు చేసింది . ఈ సినిమా మొదటి రోజు 3 కోట్ల నుండి 3.2 కోట్ల వరకు వసూలు చేస్తుందనుకుంటే ఆ అంచలనాలను అందుకోలేదు . మొత్తం మీద ఈ రవితేజ అభిమానులను నిరాశ పరిచింది . ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిని కొత్త అప్ డేట్ వచ్చింది. తొందర్లోనే ఈ సినిమా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లోకి రాబోతుంది . ఈ సినిమా సోనీలివ్’ డిజిటల్ ఫ్లాట్ ఫామ్ స్ట్రీమింగ్ అవ్వనుంది.

ఇక రామారావు ఆన్ డ్యూటీ సినిమా రవితేజకు 68వ సినిమా. ఈ ఎస్.ఎల్.వి సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తుంది . సెప్టెంబరు 15వ తేదీ నుంచి ఈ సినిమా సోనీలివ్‌లో స్ట్రీమింగ్‌ అవ్వనుంది. ఈ సినిమాకు శరత్‌ మండవ దర్శకత్వం వహించారు . హీరో వేణు ఈ సినిమా తో రీ ఎంట్రీ ఇచ్చారు. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ , ఇతర భాషల్లో కూడా ఈ సినిమా స్ట్రీమింగ్ అవ్వనుంది. రామారావు అన్ డ్యూటీని సినిమాని మిస్ అయ్యానని ఫీల్ ఐనా వాళ్ళు ఓటీటీలో చూసేయండి . తన నెక్స్ట్ ప్రాజెక్ట్ , రవితేజ సిద్ధం చేసుకున్నట్లు తెలిసిన సమాచారం. ప్రస్తుతం రవి తేజ నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో ధమాకా సినిమా చేస్తున్నారు. ఈ సినిమాను అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మించనున్నారు. ఈ సినిమాలో కథానాయికగా పెళ్లి సందడి ఫేమ్ శ్రీలీల నటిస్తున్నారు.

ఇవి కూడా చదవండి: