Brahmastra: ఓటీటీలోకి వచ్చేసిన “బ్రహ్మాస్త్ర”.. స్ట్రీమింగ్ ఎక్కడ అంటే..?
బ్రహ్మాస్త్ర ఫ్యాన్స్కి గుడ్ న్యూస్. ఈ మూవీ తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన డిస్నీ ప్లస్ హాట్స్టార్ వేదికగా గతరాత్రి నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.
Brahmastra: బాలీవుడ్ స్టార్ హీరో హీరోయిన్ మరియు క్యూట్ కపుల్ అయిన రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా నటించి మెప్పించిన చిత్రం ‘బ్రహ్మస్త్ర’. మైథలాజికల్ అడ్వెంచరస్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ మూడు భాగాలుగా రూపొందనుంది. అయితే అందులో మొదటి భాగం ‘శివ’ పేరుతో ఇటీవల రిలీజైంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ మూవీని తెలుగులో ‘బ్రహ్మస్త్రం’ పేరుతో రాజమౌళి రిలీజ్ చేశాడు. భారీ అంచనాల నడుమ సెప్టెంబర్ 9న రిలీజైన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. కాగా చాలా కాలం తర్వాత ఈ మూవీ బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కాసులు వర్షం కురిపించింది. ఇకపోతే ఈ మూవీలో టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున కీలకపాత్రలో నటించాడు.
అయితే థియేటర్లో చూడడం కుదరని ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఎదురుచూస్తున్న బ్రహ్మాస్త్ర ఫ్యాన్స్కి గుడ్ న్యూస్. ఈ మూవీ తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన డిస్నీ ప్లస్ హాట్స్టార్ వేదికగా గతరాత్రి నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. హిందీతో పాటు ప్యాన్ ఇండియా భాషలన్నింటిలో ఈ చిత్రం ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది.
ఇదీ చదవండి: “ఖుషి” సినిమాపై క్లారిటీ ఇచ్చిన విజయ్ దేవరకొండ