Last Updated:

Daily Horoscope : నేడు ఈ రాశుల వారికి ఉద్యోగం విషయంలో మంచి గుర్తింపు లభిస్తుందని తెలుసా..?

జ్యోతిష్యం ప్రకారం నేడు పలు రాశుల ఆ విషయంలో మంచి గుర్తింపు లభిస్తుందని తెలుస్తుంది. అలానే ఫిబ్రవరి 19 వ తేదీన రాశి ఫలాలు ఎలా ఉన్నాయో మీకోసం ప్రత్యేకంగా..

Daily Horoscope : నేడు ఈ రాశుల వారికి ఉద్యోగం విషయంలో మంచి గుర్తింపు లభిస్తుందని తెలుసా..?

Daily Horoscope : జ్యోతిష్యం ప్రకారం నేడు పలు రాశుల ఆ విషయంలో మంచి గుర్తింపు లభిస్తుందని తెలుస్తుంది. అలానే ఫిబ్రవరి 19 వ తేదీన రాశి ఫలాలు ఎలా ఉన్నాయో మీకోసం ప్రత్యేకంగా..

మేషం..

ఉద్యోగంలో మంచి గుర్తింపు లభిస్తుంది. ఐటీ రంగంలోని వారికి ఉద్యోగ అవకాశాలు పెరిగే సూచనలు ఉన్నాయి. వ్యాపారంలో ఉన్న వారికి లాభాలు నిలకడగా ఉంటాయి. డాక్టర్లు, లాయర్లకు చేతినిండా పని, జేబు నిండా డబ్బు ఉండే అవకాశం ఉంది. ఆరోగ్యం పరవాలేదు అనిపిస్తుంది. విద్యార్థులు సునాయాసంగా విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. ఆర్థిక లావాదేవీల వల్ల ప్రయోజనం ఉంటుంది. కోర్టు కేసు సానుకూలం అవుతుంది.

వృషభం..

ఆదాయపరంగా బాగుంటుంది. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. అదనపు ఆర్థిక ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. వివాహ ప్రయత్నాలు సఫలం అవుతాయి. సానుకూల స్పందన లభిస్తుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఉద్యోగంలో మంచి గుర్తింపు లభిస్తుంది. ఐటి రంగంలో వారికి మంచి కంపెనీ నుంచి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారుల ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. కుటుంబానికి సంబంధించి కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులు కొద్ది శ్రమతో బాగా రాణిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. ఆరోగ్యం పర్వాలేదు.

మిథునం..

మనసులోని కోరిక ఒకటి నెరవేరుతుంది. పిల్లలకు సంబంధించిన ఒక ముఖ్యమైన సమస్య సానుకూలంగా పరిష్కారం అవుతుంది. బంధుమిత్రుల నుంచి ఆర్థిక సంబంధంగా ఒత్తిడి ఉంటుంది. మీ నుంచి సహాయం పొందిన వారు ముఖం చాటెస్తారు. మీరు గతంలో తీసుకొన్న నిర్ణయాలు ఇప్పుడు మంచి ఫలితాలను ఇస్తాయి. తల్లిదండ్రుల నుంచి ఆర్థిక సహాయం పొందుతారు. వృత్తి వ్యాపారాల వారికి సమయం అనుకూలంగా ఉంది. ఐటీ వారికి మంచి కంపెనీల నుంచి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులు సునాయాసంగా పురోగతి చెందుతారు. ప్రేమ వ్యవహారాలు విజయవంతంగా ముందుకు సాగుతాయి.

కర్కాటకం..

ఆదాయం బాగానే ఉంటుంది. విలాసాల మీద బాగా ఖర్చు చేస్తారు. విహారయాత్రలకు వెళతారు. ఉద్యోగపరంగా జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. కొత్త ఆదాయ ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తాయి. కుటుంబంలో ప్రశాంతతను, సామరస్యాన్ని కాపాడటానికి చాలా కష్టపడతారు. తల్లిదండ్రుల సహకారం మీకు లభిస్తుంది. కుటుంబ సభ్యులను సంప్రదించి నిర్ణయాలు తీసుకోండి. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. విద్యార్థులు చదువుల మీద బాగా శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు ఇబ్బందికరంగా మారుతాయి. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండటం మంచిది.

సింహం..

వృత్తి వ్యాపారాలు వారు ఆశించిన స్థాయిలో విజయాలు సాధిస్తారు. లాభాల పంట పండించుకుంటారు. ఉద్యోగంలో భద్రత కరువు అవుతుంది. అధికారుల నుంచి కొద్దిగా వేధింపులు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది కానీ, అనవసర ఖర్చులు ఇబ్బంది కలిగిస్తాయి. కొందరు స్నేహితులను నమ్మి డబ్బు నష్టపోతారు. ఒక వ్యక్తిగత సమస్యను పరిష్కరించుకుంటారు. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. అదనపు ఆదాయం కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తారు. విద్యార్థులు చాలా కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా ముందుకు సాగుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు ఆశించిన స్థాయిలో ప్రయోజనం కలిగించవు.

కన్య..

ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఆదాయం మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో అభివృద్ధి కనిపిస్తోంది. ఉద్యోగం మారడం వల్ల ఉపయోగం ఉంటుంది. అదనపు ఆదాయ మార్గాల కోసం ఆలోచిస్తారు. నిరుద్యోగులకు మంచి కంపెనీలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కుటుంబ పరంగా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. పెళ్లి ప్రయత్నాలు సానుకూలంగా మారిపోతాయి. ముఖ్యమైన కార్యాలు పూర్తి చేస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. విద్యార్థులు పురోగతి చెందుతారు. ప్రేమ వ్యవహారాల్లో ముందుకు దూసుకుపోతారు. ఆర్థిక లావాదేవీల వల్ల ప్రయోజనం ఉంటుంది.

తుల..

అవసరాలకు తగిన డబ్బు అందుతుంది. కొందరు స్నేహితులు మీకు అన్ని విషయాలలోనూ అండగా నిలబడతారు. చదువులు లేదా ఉద్యోగ పరంగా ఈ రాశి వారికి విదేశాలకు వెళ్లాల్సిన అవసరం పడుతుంది. పెళ్లి ప్రయత్నాలు ఒక పట్టాన సఫలం కాకపోవచ్చు. అనవసర ప్రయాణాలు చోటుచేసుకుంటాయి. ఆర్థిక ప్రయోజనం ఏమీ లేకుండా అదనపు బాధ్యతలు మీద పడతాయి. విద్యార్థులు చదువుల మీద శ్రద్ధ పెట్టాల్సి ఉంది. ప్రేమ వ్యవహారాలు సంతృప్తికరంగా సాగవు.

ఈ రాశుల వారికి ఉద్యోగం లభిస్తుంది (Daily Horoscope)..

వృశ్చికం..

అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తవుతాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. రాదనుకున్న డబ్బు చేతికి వస్తుంది. స్నేహితులతో విభేదాలు తల ఎత్తే అవకాశం ఉంది. విదేశాల నుంచి ఉద్యోగ సంబంధంగా తీపి కబురు వినే అవకాశం ఉంది. నిరుద్యోగులకు మంచి సంస్థలో ఉద్యోగం లభిస్తుంది. ప్రేమించిన వారితోనే పెళ్లి కుదిరే అవకాశం ఉంది. ఉద్యోగరీత్యా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కీలక అంశాల్లో కుటుంబ సభ్యుల సలహాలు కూడా తీసుకోండి. విద్యార్థులు కొద్దిగా కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు ఆశించినంత సంతృప్తికరంగా ఉండవు.

ధనుస్సు..

ఉద్యోగ, వ్యాపారాల్లో ఆచితూచి అడుగు వేయండి. ముఖ్యంగా వ్యాపారంలో నమ్మిన వారు మోసగించే అవకాశం ఉంది. ఉద్యోగంలో సహచరులు మీ గురించి తప్పుడు ప్రచారం సాగించే అవకాశం ఉంది. వృత్తి నిపుణులకు సమయం అనుకూలంగా ఉంది. కుటుంబ పరంగా కొత్త నిర్ణయాలు తీసుకొని ఆచరణలో పెడతారు. కొత్త కార్యక్రమాలు చేపడతారు. కుటుంబంతో వినోదయాత్రలు చేసే అవకాశం ఉంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. మీరు నిర్వర్తించాల్సిన బాధ్యతలను ఇతరులకు అప్ప చెప్పవద్దు. స్నేహితులు, బంధువులు అండగా నిలబడతారు. బంధువుల సహాయంతో పెళ్లి ప్రయత్నాలు చేస్తారు. ప్రేమ ప్రయత్నంలో విజయం సాధిస్తారు. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది.

మకరం..

పెళ్లి ప్రయత్నాలలో బంధువులు సహకరిస్తారు. ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. ఉద్యోగరీత్యా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు చేపట్టడానికి అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లో లాభాలు కనిపిస్తాయి. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. విద్యార్థులు చదువుల్లో ముందడుగు వేస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఉపశమనం లభిస్తుంది. కుటుంబంలో ప్రశాంత పరిస్థితులు నెలకొంటాయి. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి ఇది సమయం కాదు. ఐటీ రంగం వారు విదేశీ కంపెనీలో ప్రయత్నాలు సాగిస్తే మంచిది. అనుకూలంగా ఉంది. ఆర్థిక లావాదేవీలు ఆశించిన స్థాయిలో ప్రయోజనాలు కలిగిస్తాయి.

కుంభం..

ఏలినాటి శని కారణంగా కొన్ని ఆర్థిక సమస్యలు మధ్య మధ్య అనారోగ్యాలు తప్పకపోవచ్చు. చేపట్టిన ప్రతి పని ఆలస్యం అవుతూ ఉంటుంది. శ్రమ, తిప్పట ఎక్కువగా ఉంటాయి. పెళ్లి ప్రయత్నాలు కూడా వెనుకబడిపోతుంటాయి. ఆర్థిక పరిస్థితి నిలకడగానే ఉంటుంది కానీ అనవసర ఖర్చులు బాగా పెరిగిపోతాయి. ఆరోగ్యం చాలావరకు మెరుగుపడుతుంది. ఉద్యోగంలో అదనపు ఆదాయం ఏది లేకపోయినా క్షణం తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. కొందరు స్నేహితులను నమ్మి డబ్బు నష్టపోతారు. అప్పులు చేయాల్సి వస్తుంది. ప్రస్తుతానికి ఎవరికీ హామీలు ఉండకపోవడం మంచిది. కొత్త ప్రయత్నాలను వాయిదా వేసుకోవడం మంచిది. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది.

మీనం..

సమయం అన్ని విధాలుగాను అనుకూలంగా ఉంది. సద్వినియోగం చేసుకోండి. ఆర్థిక ప్రయత్నాలు ప్రయోజనం కలిగిస్తాయి. మీ బలాలు, బలహీనతల గురించి బయట వారితో చర్చించవద్దు. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ప్రేమ వ్యవహారాల్లో దూసుకు వెళతారు. ఉద్యోగ పరంగా మంచి అభివృద్ధి కనిపిస్తోంది. సంపాదన పెరుగుతుంది. వ్యాపారంలో ఆశించిన స్థాయిలో లాభాలు కనిపిస్తాయి.  కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/