Last Updated:

Buddha Statue: ఇంట్లో బుద్ధుని విగ్రహాన్ని పెట్టుకుంటున్నారా.. అయితే ఈ నియమాలు పాటించండి

బుద్ధ విగ్రాహాల్లో కూడా చాలా రకాలు ఉంటాయి. ఏయే రూపాల విగ్రహాలు తెచ్చుకోవాలి.. ఇంట్లో ఎక్కడ పెట్టుకోవాలనే సందేహాలు చాలామందికే ఉంటాయి.

Buddha Statue: ఇంట్లో బుద్ధుని విగ్రహాన్ని పెట్టుకుంటున్నారా.. అయితే ఈ నియమాలు పాటించండి

Buddha Statue: ఈ మధ్య చాలామంది అలంకరణ కోసం ఇంట్లో బుద్ధ విగ్రహాలు పెట్టుకోవడం ఎక్కువగా కనిపిస్తోంది. బుద్ధ విగ్రాహాల్లో కూడా చాలా రకాలు ఉంటాయి. ఏయే రూపాల విగ్రహాలు తెచ్చుకోవాలి.. ఇంట్లో ఎక్కడ పెట్టుకోవాలనే సందేహాలు చాలామందికే ఉంటాయి. అయితే బుద్ధున్ని ఇంటికి తెచ్చుకునే ముందు కొన్ని వాస్తు నియమాలను పాటించాలని సూచిస్తున్నారు వాస్తు నిపుణులు. సరైన నియమాలను పాటించి ఇంట్లో బుద్ధ విగ్రహాన్ని పెట్టుకోవడం వల్ల అంతా మంచి జరుగుతుందని చెబుతున్నారు. గౌతమ బుద్ధుడు సామరస్యం, ఆత్మ బలానికి , జ్ఞానానికి చిహ్నం. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో కుడి మూలన బుద్ధిని విగ్రహం ఉంచుకోవడం వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుందని చెబుతారు.

 

ధ్యానంలో ఉండే బుద్ధ విగ్రహం

ధ్యాన భంగిమలో ఉన్న బుద్ధుని ప్రతిమ ఇంట్లో శాంతిని తెస్తుంది. ధ్యానం చేసుకునే చోట ఈ విగ్రమాన్ని పెట్టుకోవచ్చు. లేదంటే గార్డెన్ లో కానీ, విశ్రాంతి తీసుకునే చోట గానీ ఈ చిత్రాన్ని లేదా విగ్రహాన్ని పెట్టుకోవచ్చు. ధ్యాన బుద్ధను చూసినప్పుడు తెలియకుండానే ఓ రకమైన శాంతి భావన కలుగుతుంది.

 

గార్డెన్ లో ..

ఇంట్లో బుద్ధ విగ్రహం ఉంటే పాజిటివ్ నెస్ తో వైబ్రెంట్ గా ఉంటుంది. బాల్కని లేదా తోటలో బుద్ధుని పెట్టుకుంటే ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. ఓ పూల మొక్క పక్కన బుద్ధున్ని అలంకరించుకోవడం వల్ల అందంగా ఉండటమే కాకుండా మానసికంగా చాలా ప్రశాంతత కలిగే భావన ఉంటుంది. విశ్రాంతి భంగిమలో ఉన్న విగ్రహం లేదా ధ్యాన బుద్దుడి విగ్రహాన్ని తోటలో పెట్టుకోవచ్చు.

శయన బుద్ధుడు

కుడి చేతిని తలకింద పెట్టుకుని పడుకున్న భంగిమలో ఉన్న బుద్ధుడు జ్ఞానం, ముక్తికి ప్రతీకంటారు. ఈ బుద్ధ ప్రతిమ ఇంట్లో శాంతి ఉండేలా దోహదం చేస్తుంది. ఇంట్లో పడమర దిక్కుకు ముఖం ఉండేలా పెట్టుకుంటే మంచిది.

 

ఆశీర్వాద బుద్ధ ప్రతిమ

ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీ చేరకుండా ఉండాలంటే ఆశీర్వాదం కోసం ఎత్తిన బుద్ధిని విగ్రహాన్ని పెట్టుకోవచ్చు. ఇలాంటి విగ్రహాలు శాతం, భయం నుంచి విముక్తికి సంకేతాలని చెబుతారు. వాస్తు దోషాలను పోగొట్టేందుకు ఆశీర్వాద భంగిమలో ఉన్న బుద్ధ విగ్రహం ఇంట్లో పెట్టుకుంటే మంచిదని వాస్తు నిపుణలు చెబుతారు. ఈ విగ్రహాన్ని ఇంటి ప్రవేశ ద్వారం దగ్గర ఉంచడం వల్ల ప్రతికూల శక్తి ప్రవేశించకుండా నివారిస్తుంది.

బుద్ధుని పెట్టుకునేముందు ఈ వాస్తు నియమాలు తెలుసుకోవాలి

ముఖ్యంగా బుద్ధ విగ్రహం కేవలం ఒక అలంకరణ వస్తువు కాదనే విషయం గుర్తుపెట్టుకోవాలి. బుద్ధుడు పవిత్రమైన, శక్తివంతమైన మూర్తి అని మరచిపోవద్దు.

బుద్ధ విగ్రహాన్ని నేల మీద గానీ.. లాకర్ లో గానీ పెట్టుకోకూడదు.

బుద్ధ విగ్రహం ఎప్పుడైనా సరే బుద్ధుని విగ్రహం చూసేందుకు ఎదురుగా లేదా తలపైకెత్తి చూసే విధంగా పెట్టుకోవాలి.

కళ్లు దించి చూసే విధంగా బుద్ధ విగ్రహాన్నిపెట్టుకోకపోవడం ఉత్తమం. కూర్చున్నపుడు లేదా పడుకుంటున్నపుడు మన కాళ్లు బుద్ధుని వైపు ఉండకుండా చూసుకోవాలిస

విగ్రహం చుట్టూ చెత్త చెదారం చేరకుండా చూసుకోవాలి. మానసిక ప్రశాంతతకు బుద్ధుడు చిహ్నంగా భావిస్తారు . కాబట్టి ఎప్పుడూ ఆ ప్రదేశాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి.

ఇంట్లో బెడ్ రూమ్ లో, బాత్ రూమ్ దగ్గర లో, వంట గదిలో బుద్ధ విగ్రహాన్ని పెట్టుకోవద్దు.

 

నోట్ : వివిధ ఆధ్యాత్మిక పుస్తకాలు, పండితులు పేర్కొన్న కొన్ని పరిష్కారాలను ఇక్కడ అందించాం. వాస్తు నియమాలు వారి వారి నమ్మకాలపై ఆధారపడి ఉంటాయి. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘ప్రైమ్9 న్యూస్’ బాధ్యత వహించదని గమనించగలరు.