Last Updated:

February 19 Horoscope: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి సంతానం నుంచి ధన లాభం!

February 19 Horoscope: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి సంతానం నుంచి ధన లాభం!

February 19 Horoscope Today in Telugu: మొత్తం 12 రాశులు. ఏ రాశి వారికి ఎలా ఉంది? ఏ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది? వంటి వాటిపై జ్యోతిష్యులు పలు విషయాలు వెల్లడించారు.

మేషం – వృత్తి, వ్యాపారాలలను విస్తరిస్తారు. ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. నూతన ప్రయత్నాలలో పురోగతి సాధిస్తారు. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి.

వృషభం – పారిశ్రామిక రంగాలలోని వారికి విదేశీ పర్యటనల సూచనలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండటం అన్ని విధాల మంచిది.

మిథునం – చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. సంతానం నుండి కొంత ధన లాభం పొందుతారు. నూతన విద్యలపై ఆసక్తి చూపుతారు. రుణ బాధల నుంచి విముక్తులు అవుతారు.

కర్కాటకం – ఇంటా-బయటా అనుకూలంగా ఉంటుంది. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు.

సింహం – మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఇతరుల విషయాలలో జోక్యం తగదు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. సంఘంలో గౌరవం పొందుతారు.

కన్య – ఆర్థిక వ్యవహారాలలో పురోభివృద్ధి సాధిస్తారు. రుణ బాధల నుంచి బయటపడతారు. అందరిలోనూ ప్రత్యేకమైన గుర్తింపు పొందుతారు. అనుకోని అవకాశాలు లభిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోండి.

తుల – భూముల క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు. కుటుంబ సమస్యలు ఎదురైన అధిగమిస్తారు. సంతానం సాంకేతికపరమైన విద్య అవకాశాలు పొందుతారు. శ్రమానంతరం కాంట్రాక్టులు దక్కుతాయి.

వృశ్చికం – ఆర్థికపరమైన వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. రాజకీయ, కళా రంగాల వారికి పదవి యోగాలు ఉంటాయి. కుటుంబ సమస్యలు కొంతమేర ఇబ్బంది పెడతాయి.

ధనున్సు – అప్రయత్న కార్యసిద్ధి. ఎంతో కాలంగా ఊరిస్తున్న ఒక అవకాశం దగ్గరకు వచ్చి ఆశ్చర్యపోతారు. రుణ బాధలు తొలుగుతాయి. ప్రభుత్వపరంగా, వ్యక్తుల పరంగా రావలసిన ప్రయోజనాలు దక్కుతాయి.

మకరం – రుణ బాధలు తొలుగుతాయి. వివాహ ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. నూతన ఉత్సాహంతో పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది.

కుంభం – సంతానమునకు నూతన ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. రుణాలు తీరి ఉపశమనం పొందుతారు. కీలక నిర్ణయాలలో మీ సొంత ఆలోచనలు మీకు మేలు కలిగిస్తాయి.

మీనం – దూరప్రాంతాల నుంచి వచ్చిన సమాచారం మీ ఆనందానికి కారణం అవుతుంది. ఆర్థికపరమైన వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. శుభకార్యాలు ఘనంగా చేస్తారు.