Last Updated:

Stock Marckets: బుధవారం లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం లాభాలతో మొదలయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాలతో లాభాలతో ప్రారంభమయ్యాయి. మార్కెట్లు ప్రారంభం కాగానే సెన్సెక్స్‌ 176 పాయింట్ల లాభంతో 62, 969 దగ్గర ట్రేడ్ అయింది.

Stock Marckets: బుధవారం లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

Stock Marckets: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం లాభాలతో మొదలయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాలతో లాభాలతో ప్రారంభమయ్యాయి. మార్కెట్లు ప్రారంభం కాగానే సెన్సెక్స్‌ 176 పాయింట్ల లాభంతో 62, 969 దగ్గర ట్రేడ్ అయింది. 63 పాయింట్ల లాభంతో నిఫ్టీ 18,662 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.56 దగ్గర ప్రారంభం అయింది.

 

పెరిగిన చమురు ధరలు(Stock Marckets)

సెన్సెక్స్‌ 30 సూచీలో ఎస్‌బీఐ, టెక్‌ మహీంద్రా, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఏషియన్‌ పెయింట్స్‌ , నెస్లే ఇండియా, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, ఇన్ఫోసిస్‌, పవర్‌గ్రిడ్‌, విప్రో, ఎన్‌టీపీసీ, టాటా స్టీల్‌, షేర్లు లాభాల్లో ఉన్నాయి. బజాజ్‌ ఫైనాన్స్‌ మాత్రమే స్వల్ప నష్టాల్లో ఉంది. కాగా, అమెరికా మార్కెట్లు మంగళవారం లాభాలతో క్లోజ్ అయ్యాయి. వచ్చేవారం వెలువడనున్న ద్రవ్యోల్బణ గణాంకాలు, ఫెడ్‌ సమావేశంపై మదుపర్లు ఎక్కువగా దృష్టి సారించారు. ఆసియా పసిఫిక్‌ సూచీలు బుధవారం సానుకూలంగా ట్రేడవుతున్నాయి. చమురు ఉత్పత్తి కోతలను సౌదీ అరేబియా అధికారికంగా ధ్రువీకరించింది. ఈ నేపథ్యంలో చమురు ధరలు పెరిగాయి.