Home /Author M Rama Swamy
Rishabh Pant’s Interesting Comments on England Test series: భారత జట్టు త్వరలో ఇంగ్లండ్ వెళ్లనుంది. ఈ నేపథ్యంలో తాను కొన్నిరోజులు క్రికెట్ గురించి ఆలోచించడం మానేస్తానని రిషభ్ పంత్ అంటున్నాడు. చిన్న విరామం తర్వాత తిరిగి ఇంగ్లండ్‌తో ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ కోసం సన్నద్ధమవుతానని వివరిస్తున్నాడు. ఇంగ్లండ్ టూర్ నేపథ్యంలో ఇటీవల టీంమిండియా జట్టును బీసీసీఐ ప్రకటించింది. కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్, వైస్ కెప్టెన్‌గా రిషభ్ పంత్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు. ఐపీఎల్ […]
RGUKT 2025 Admissions Online: తెలంగాణలోని రాజీవ్ గాంధీ విజ్ఞాన, సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) ఆధ్వర్యంలోని ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌ల్లో 2025-26 విద్యా సంవత్సరానికి ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. యూనివర్సిటీ ఉపకులపతి గోవర్దన్ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఈ నెల 31వ తేదీ నుంచి జూన్ 21 వరకు ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. జులై 4వ తేదీన ప్రొవిజినల్ ఎంపిక జాబితాను ప్రకటించి, జులై 7వ తేదీన తొలి దశ కౌన్సెలింగ్ […]
AP CM Chandrababu Naidu @Mahanadu: దేవుడు ఇచ్చిన శక్తితో పార్టీని సమర్థంగా నడిపించేందుకు కృషిచేస్తానని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. మరోసారి జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం మహానాడులో పార్టీ శ్రేణులనుద్దేశించి ప్రసంగించారు. సహకరించిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు.. తన ఎంపికకు సహకరించిన ప్రతిఒక్కరికీ సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. తెలుగు జాతి ఉన్నంత వరకు టీడీపీ ఉంటుందన్నారు. నా బలం, బలగం టీడీపీ అన్నారు. నాపై కార్యకర్తలు ఉంచిన నమ్మకాన్ని […]
Chandrababu Elected as TDP National President: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు మరోసారి టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. టీడీపీ నాయకులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 30 ఏళ్ల నుంచి అధ్యక్షుడిగా చంద్రబాబు ఉన్నారు. 1995లో తొలిసారి టీడీపీ పగ్గాలు చేపట్టారు. ఇప్పటి వరకు ఆయన ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నిక అవుతున్నారు. ప్రతి రెండేళ్లకోసారి టీడీపీ అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. ఇందులో భాగంగా మహానాడులో చంద్రబాబును మరోసారి జాతీయ అధ్యక్షుడిగా నాయకులు ఎన్నుకున్నారు. నామినేషన్లు ప్రతిపాదించిన నేతలు.. మహానాడు […]
3 Indians missing in Iran: ఇరాన్లో ముగ్గురు భారతీయులు మిస్సింగ్ అయ్యారు. విషయాన్ని టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం ధ్రువీకరించింది. అదృశ్యమైన ముగ్గురి కోసం గాలింపు చేపడుతున్నట్లు పేర్కొంది. తప్పిపోయిన వారు పంజాబ్‌లోని సంగ్రూర్‌కు చెందిన హుషన్ప్రీత్సింగ్, ఎస్బీఎస్ నగర్‌కు చెందిన జస్పాల్సింగ్, హోషియాపూర్‌కు చెందిన అమృత్‌పాల్ సింగ్‌గా గుర్తించారు. ఈ నెల 1వ తేదీన టెహ్రాన్‌లో ల్యాండ్ అయిన కొద్దిసేపటికే అదృశ్యమైనట్లు ఎంబసీ తెలిపింది. ముగ్గురు యువకుల కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నామని, ఎప్పటికప్పుడు […]
Good news for Farmers Union Cabinet Meeting: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో బుధవారం కేబినెట్ సమావేశం జరిగింది. ఈ భేటీలో ఐదు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా రైతన్నలకు సర్కారు వరాలు ప్రకటించింది. ఎమ్మెస్పీ 50 శాతం పెంచింది. కేబినెట్ భేటీ అనంతరం కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వివరాలు వెల్లడించారు. రైతుల కోసం కీలక నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. 11 ఏళ్లలో ఖరీప్ పంటలకు ఎమ్మెస్పీ భారీగా పెరిగిందని చెప్పారు. 2025-26కి […]
NDA MLAs meet Manipur Governor: మణిపూర్‌లో కొత్త సర్కారు ఏర్పాటుకు కసరత్తు మొదలైంది. ఎన్.బీరేన్ సింగ్ సీఎం పదవికి ఫిబ్రవరి 13వ తేదీన రాజీనామా చేయడంతో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి శాసనసభ సుప్తచేతనావస్థలో ఉంది. ఈ క్రమంలోనే 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలతో సహా 10 మందికి పైగా ఎమ్మెల్యేలు బుధవారం రాజ్‌భవన్‌లో గవర్నర్ అజయ్ కుమార్ భల్లాను కలిశారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు తమ అభిప్రాయం తెలియజేశారు. ఈ […]
Telangana CM Revanth Reddy presents Gurukul Awards: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లు అమలు చేస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. బాబూ జగ్జీవన్‌రామ్ భవన్లో ఏర్పాటు చేసిన గురుకుల అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎస్సీ, ఎస్టీలను పాలకులుగా మార్చింది కాంగ్రెస్ సర్కారేనని పేర్కొన్నారు. చదువుతోనే ఏదైన సాధ్యం.. చాలా మంది మహనీయులకు గుర్తింపు తెచ్చింది కులం కాదని, చదువు మాత్రమేనని స్పష్టం చేశారు. ఉన్నత శిఖరాలకు ఎదగాలంటే చదువుతోనే సాధ్యమవుతుందని […]
4 Laborers Died in Rajasthan While Searching Gold: సెప్టిక్ ట్యాంక్‌లో బంగారం కోసం గాలింపు చర్యలు చేపడుతుండగా, ఊపిరాడక నలుగురు కూలీలు మృతిచెందారు. ఈ ఘటన రాజస్థాన్‌లోని జైపుర్‌లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. జైపుర్‌లోని ఒక బంగారం షాపు యజమాని వికాస్ మెహతా బంగారం, వెండిని తమ సిబ్బంది ప్రాసెసింగ్ చేస్తున్నారు. అదే సమయంలో అందులో కొంత బంగారం సెప్టిక్ ట్యాంక్‌లో పేరుకుపోయినట్లు గుర్తించారు. బంగారాన్ని బయటకు తీయాలని సోమవారం […]
Bangladesh Ex PM Sheikh Hasina: బంగ్లాలో రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ ఆందోళనలు జరిగాయి. దీంతో నాటి ప్రధానమంత్రి షేక్ హసీనా దేశం వీడారు. అప్పటి నుంచి ఆమె భారత్‌లో తలదాచుకుంటున్నారు. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్‌కు చెందిన అంతర్జాతీయ క్రైమ్ ట్రైబ్యునల్ హసీనాతోపాటు పలువురు మాజీ మంత్రులు, సలహాదారులు, మిలటరీ అధికారులపై అరెస్టు వారెంట్లు జారీ చేసింది. తాజాగా ఈ కేసులో విచారణ సందర్భంగా చీఫ్ ప్రాసిక్యూటర్ మహమ్మద్ తజుల్ ఇస్లాం ట్రైబ్యునల్‌కు కీలక విషయాలు వెల్లడించారు. […]