Home /Author M Rama Swamy
Jayashankar Bhupalpally District : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం మేడిగడ్డ బ్యారేజీలో శనివారం గల్లంతైన ఆరుగురి మృతదేహాలను ఆదివారం వెలికితీశారు. రక్షిత్ (13), సాగర్ (16), మధుసూదన్ (18), రాంచరణ్ (17), శివ మనోజ్ (15), రాహుల్ (19) మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మహదేవ్పూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శుభకార్యానికి వెళ్లి.. మహదేవ్పూర్ మండలం అంబట్పల్లికి చెందిన గొలుకొండ మల్లయ్య ఇంట్లో రెండు రోజు క్రితం పెళ్లి జరిగింది. శుభకార్యానికి హాజరైన బంధువుల్లో […]
CM Revanth Reddy : రాజకీయాల్లో వాజ్‌పేయికి ఉన్న గౌరవం బండారు దత్తాత్రేయకు ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రజల కథే నా ఆత్మకథ పుస్తకావిష్కరణలో పాల్గొని సీఎం మాట్లాడారు. దత్తాత్రేయ ప్రజల మనిషి అని కొనియాడారు. ఆయన ఏ పదవి చేపట్టినా సరైన న్యాయం చేశారని వ్యాఖ్యానించారు. గౌలిగూడ గల్లీ నుంచి హర్యానా గవర్నర్ వరకు ఆయనది సుదీర్ఘ ప్రయాణమన్నారు. దత్తన్న జీవితంలో ఎన్నో పదవులు చేపట్టినా ఎప్పుడూ ప్రజలకు దూరం కాలేదన్నారు. దత్తాత్రేయతో […]
Indian cricketer Rink Singh : సమాజ్‌వాది పార్టీ ఎంపీ ప్రియ సరోజ్‌తో భారత క్రికెటర్ రింక్ సింగ్ రిసెప్షన్ జరిగింది. లఖ్‌నవూలోని సెంట్రమ్ హోటల్లో నిశ్చితార్థం జరుగగా, మాజీ క్రికెటర్లు ప్రవీణ్ కుమార్, పీయూష్ చావ్లా, యూపీ రంజీ జట్టు కెప్టెన్ ఆర్యన్ జుయల్ పాల్గొన్నారు. సమాజ్‌వాది పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, ఎంపీ డింపుల్ యాదవ్, పార్టీ సీనియర్ నేత ప్రొఫెసర్ రామ్‌గోపాల్, కాంగ్రెస్ పార్టీ నేత రాజీవ్ శుక్లా తదితర రాజకీయ ప్రముఖులు […]
Ashok Gehlot, Sachin Pilot Meet : రాజస్థాన్‌లో కాంగ్రెస్ పార్టీ రాజకీయాలంటే మొదట మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ మధ్య విభేదాలే గుర్తుకొస్తాయి. ఈ క్రమంలో శనివారం వీరిద్దరూ భేటీ అయ్యారు. గెహ్లాట్ నివాసంలో జరిగిన సమావేశం చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు ఎక్స్ (ట్విట్టర్)లో పోస్టులు పెట్టారు. తన తండ్రి, మాజీ కేంద్రమంత్రి రాజేశ్ పైలట్ 25వ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి […]
CM Chandrababu Naidu participated in the book launch of Dattatreya’s autobiography ‘Prajale Naa Atma Katha’ : జెంటిల్మెన్కు ప్రతిరూపం హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో నిర్వహించిన దత్తాత్రేయ ఆటోబయోగ్రఫీ ‘ప్రజలే నా ఆత్మకథ’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు. దత్తాత్రేయను దత్తన్న అని అభిమానంగా పిలుచుకుంటారని చెప్పారు. సాధారణ కార్యకర్త నుంచి జాతీయ నేతగా ఎదిగారని కొనయాడారు. ఎన్నో […]
Rahul Gandhi participated in the Samvad program : లోక్‌సభలో పతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఓ యువతి మధ్య పెళ్లి గురించి ఆసక్తికర చర్చ జరిగింది. బిహార్ పర్యటనలో మహిళా సంవద్ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఆయన యువతతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీతో ఓ యువతి జరిపిన ఇంటరాక్షన్‌కు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రియా పాశ్వాన్ ఓ సామాజిక కార్యకర్త. సోషల్ మీడియా వేదికగా […]
AP Crime : ఏపీ సచివాలయంలో అవుట్ సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి 7మంది నిరుద్యోగుల నుంచి రూ.53 లక్షలు వసూలు చేసిన ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నకిలీ అపాయింట్మెంట్ ఆర్డర్లను సృష్టించి నిందితులు రూ.53 లక్షలు కాజేశారు. నలుగురు నిందితులను ఒకటో పట్టణం పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.6 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. కేసుకు సంబంధించిన వివరాలను విజయనగరం డీఎస్పీ ఎం.శ్రీనివాసరావు శనివారం మీడియాకు వెల్లడించారు. విజయనగరం జిల్లా […]
Agriculture Minister Tummala Nageswara Rao : కాళేశ్వరం వివాదంలోకి తనను కావాలని లాగుతున్నారని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. కాళేశ్వరం కమిషన్ ఎదుట బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అబద్ధాలు చెప్పారని పేర్కొన్నారు. సబ్ కమిటీకి, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధంలేదన్నారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట ఇచ్చిన వాంగ్మూలం అసత్యాలతో కూడుకొని ఉందన్నారు. ఈటల అన్నీ అబద్ధాలు చెప్పారన్నారు. ఈటల ఇచ్చిన సమాధానాలు వాస్తవ దూరంగా ఉన్నాయన్నారు. వాంగ్మూలం ఈటల అనాలోచితంగా […]
Chhattisgarh : ఛత్తీస్‌గఢ్‌లో కొన్నిరోజులుగా కాల్పుల మోతతో దద్దరిల్లుతోంది. బీజాపుర్ జిల్లాలోని నేషనల్ పార్కులో ఆపరేషన్ జరుగుతోంది. మూడోరోజూ జరిగిన ఆపరేషన్‌లో మరో ఐదుగురు మావోయిస్టులు మృతిచెందారు. మావోల మృతదేహాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఘటనాస్థలిలో 2 ఏకే 47 రైఫిళ్లు, భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డీహైడ్రేషన్, పాముకాటు, తేనెటీగలు దాడి చేయగా, కొందరు జవాన్లు అస్వస్థతకు గురయ్యారు. గాలింపు సందర్భంగా మరికొందరు జవాన్లకు గాయాలయ్యాయి. మూడు రోజులుగా నేషనల్ […]
AP CM Chandrababu Teleconference : పార్టీలో ప్రతిఒక్కరి పనితీరుపై సర్వేలు చేయిస్తానని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర అభివృద్ధిలో స్పష్టమైన మార్పు చూపించామన్నారు. శనివారం టీడీపీ నేతలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో సీఎం మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని సూచించారు. పార్టీలో ప్రతిఒక్కరి పనితీరుపై సర్వేలు చేయిస్తున్నామని, బాగా పనిచేసిన వారికి ప్రోత్సాహం ఉంటుందన్నారు. పార్టీ, ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తే ఎవరినైనా వదులుకుంటామని హెచ్చరించారు. […]