Home /Author M Rama Swamy
Russian President Vladimir Putin : రష్యా-ఉక్రెయిన్ రెండుదేశాల మధ్య మరికొన్ని గంటల్లో శాంతి చర్చలు మొదలుకానున్నాయి. ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్ సైన్యంపై తీవ్ర విమర్శలు చేశారు. ఉక్రెయిన్ పౌరులను బలవంతంగా సైన్యంలో చేరుస్తోందని ఆరోపించారు. బిజినెస్ రష్యా ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. విషయాన్ని స్పుత్నిక్ న్యూస్ తన కథనంలో వెల్లడించింది. బలవంతంగా సైన్యంలో చేర్చుకుంటోంది.. బిజినెస్ రష్యా ఆర్గనైజేషన్ సమావేశంలో పుతిన్ […]
Minister Nara Lokesh : మహానాడుకు ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయని, ఈ నెల 27వ తేదీ నుంచి 29వ తేదీ వరకు కడపలో నిర్వహించనున్నట్లు మంత్రి నారా లోకేశ్ తెలిపారు. బుధవారం మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో మహానాడు కమిటీల కన్వీనర్లు, కో-కన్వీనర్లతో భేటీ అయ్యారు. మహానాడు ఏర్పాట్లపై నేతలతో చర్చించారు. ఈ సందర్భంగా పలువురు మంత్రులు, సీనియర్ నేతలకు బాధ్యతలు అప్పగించారు. పొలిట్ బ్యూరో సమావేశంలో మహానాడు ఏర్పాట్లపై మంత్రి ఆధ్వర్యంలోని మంత్రుల కమిటీ నివేదిక […]
AP CM Chandrababu : ప్రపంచంలో యువత ఎక్కువగా ఉండేది ఇండియాలోనే అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఆర్థిక సంస్కరణలతో ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం వచ్చిందని చెప్పారు. అప్పుడే వస్తున్న ఐటీని సద్వినియోగం చేసుకున్నామని తెలిపారు. విజయవాడలో పశు సంవర్ధకశాఖ ఆధ్వర్యంలో టెక్ ఏఐ కాంక్లేవ్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. జాతీయ రహదారుల అభివృద్ధి.. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో ఏ పనైనా సులువుగా చేసుకునే పరిస్థితి వచ్చిందని చెప్పారు. […]
Maharashtra CM Devendra Fadnavis : ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఘన సత్కారం లభించింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తన ఇంటికి రోహిత్‌ను ఆహ్వానించారు. ఈ సందర్భంగా అతడని సీఎం సన్మానించారు. విషయాన్ని ముఖ్యమంత్రి స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. రోహిత్ ఇటీవల టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. మే 7న అధికారిక ప్రకటన చేశాడు. తెలుపు రంగు జెర్సీలో ఇండియాకు కెప్టెన్‌గా వహించడం తనకు దక్కిన గొప్ప గౌరవం అన్నాడు. […]
Gali Janardhan Reddy : ఓబుళాపురం మైనింగ్ కేసులో గాలి జనార్దన్‌రెడ్డి అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అతడిని చంచల్‌గూడకు తరలించారు. జైల్లో తనకు అదనపు సౌకర్యాలు కల్పించాలని నాంపల్లిలోని సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. చంచల్‌గూడ జైలులో తనకు సౌకర్యాలు కల్పించాలని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన పిటిషన్ రిజిస్ట్రీ పరిశీలనలో ఉంది. ఓబుళాపురం మైనింగ్ కేసులో గాలికి సీబీఐ కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే.
KTR fires Revanth government : కాంగ్రెస్ సర్కారుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి విరుచుకుపడ్డారు. మిస్ వరల్డ్ పోటీలో పాల్గొంటున్న వారి పర్యటన కోసం పేదల ఇళ్లు కూల్చుతున్నారంటూ ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ విధానంపై ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి సామాజిక మాధ్యమం ఎక్స్‌లో కేటీఆర్ ప్రశ్నలు సంధించారు. వరంగల్‌లో కూల్చివేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అందాల పోటీల కోసం పేదల ఇళ్లను ధ్వంసం చేయడమే ప్రజాపాలనా అంటూ విరుచుకుపడ్డారు. రాహుల్ […]
Sravan Rao : ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న శ్రవణ్‌రావుపై సీసీఎస్‌లో చీటింగ్ కేసు నమోదైంది. విచారణకు హాజరు కావాలని అధికారులు నోటీసులు జారీ చేశారు. మంగళవారం విచారణ అనంతరం అరెస్టు చేసినట్లు ప్రకటించారు. గతంలో అఖండ ఎంటర్‌ప్రైజెస్‌కు శ్రవణ్‌రావు రూ.6కోట్లు మోసం చేశారని బాధితులు ఫిర్యాదు చేశారు. నాంపల్లి కోర్టు న్యాయమూర్తి నివాసంలో శ్రవణ్‌రావును హాజరు పరిచేందుకు తరలించారు. ఫోన్ ట్యాపింగ్ సమయంలో రెండు సెల్ ఫోన్లు.. బీఆర్ఎస్ ప్రభుత్వ […]
Bangladesh : బంగ్లాలో మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ ప్రభుత్వం కూప్పకూలింది. ఆ తర్వాత పార్టీ నేతలు దారుణ పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే హసీనా దేశం విడిచి ఇండియాలో తలదాచుకున్నారు. మిగతా నాయకులు తాత్కాలిక ప్రభుత్వంలో అనేక కేసుల్లో చిక్కుకున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో బంగ్లా మాజీ అధ్యక్షుడు మహ్మద్ అబ్దుల్ హమీద్ దేశం విడిచి పారిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ రోజు తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో థాయ్‌లాండ్ విమానం […]
External Affairs Ministry Spokesperson Randhir Jaiswal : ఉగ్రవాదాన్ని పెంచిపోషించిన పాక్ పర్యవసానాలను ఎదుర్కోక తప్పదని భారత్ మరోసారి స్పష్టం చేసింది. ఇండియాతో సహా ప్రపంచ దేశాల్లోని అమాయకులను ఉగ్రవాదులు బలి తీసుకున్నారని పేర్కొంది. సీమాంతర ఉగ్రవాదానికి పాకిస్థాన్ మద్దతు నిలిపివేసే వరకూ సింధూ జలాల ఒప్పందం నిలిపివేత కొనసాగుతుందని పేర్కొంది. ఆపరేషన్ సిందూర్ అనంతరం పరిణామాలపై విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. భారత్‌లో ఎలాంటి […]
Vallabhaneni Vamsi : మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి భారీ ఊరట లభించింది. విజయవాడ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. సత్యవర్ధన్ కిడ్నాప్, బెదిరింపుల కేసులో షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. వంశీ ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక కోర్టులో రెండుసార్లు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. న్యాయస్థానం రెండుసార్లు బెయిల్ తిరస్కరించింది. దీంతో మూడోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌పై ఇటీవల ఇరువర్గాల తరఫు న్యాయవాదులు వాదనలు విన్న కోర్టు.. […]