Last Updated:

AP CM Jagan: 146 కొత్త అంబులెన్సులను ప్రారంభించిన ఏపీ సీఎం జగన్

108 అంబులెన్స్‌ సేవలను మరింత బలోపేతం చేసేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా 146 కొత్త అంబులెన్స్‌లను కొనుగోలు చేసింది. ఈ అంబులెన్స్‌లను సీఎం వైఎస్‌ జగన్‌ తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయం వద్ద ప్రారంభించారు.

AP CM Jagan: 146 కొత్త అంబులెన్సులను ప్రారంభించిన ఏపీ  సీఎం జగన్

AP CM Jagan: 108 అంబులెన్స్‌ సేవలను మరింత బలోపేతం చేసేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా 146 కొత్త అంబులెన్స్‌లను కొనుగోలు చేసింది. ఈ అంబులెన్స్‌లను సీఎం వైఎస్‌ జగన్‌ తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయం వద్ద ప్రారంభించారు. ఇందులో భాగంగా అప్పట్లో 96 కోట్ల 50లక్షల రూపాయలతో అధునాతన సౌకర్యాలతో 412 కొత్త అంబులెన్స్‌లు కొనుగోలు చేసి, అప్పటికే ఉన్నవాటికి మరమ్మతులు చేసి 748 అంబులెన్స్‌లతో సేవలను విస్తరించారు.

చాలా కాలంగా ప్రయాణించి పాడైపోయిన వాటి స్థానంలో ప్రభుత్వం ఇటీవల రూ.34.79 కోట్లతో 146 అంబులెన్స్‌లను కొనుగోలు చేసింది. మరోవైపు 108 సేవల కోసం ప్రభుత్వం ఏటా రూ.188.56 కోట్లు ఖర్చు చేస్తోంది. ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా గత టీడీపీ ప్రభుత్వంతో పోలిస్తే సేవలు చాలా మెరుగుపడ్డాయి. అప్పట్లో 1.19 లక్షల మందికి ఒక అంబులెన్స్ ఉంటే ఇప్పుడు 74,609 మందికి ఒక అంబులెన్స్ ఉంది.

రోజుకు 108 అంబులెన్సులు..(AP CM Jagan)

ప్రస్తుతం రాష్ట్రంలో రోజుకు 3,089 కేసులకు 108 అంబులెన్స్‌లు హాజరవుతున్నాయి. ఈ విధంగా, జూలై 2020 నుండి ఇప్పటివరకు, అంబులెన్స్‌లు 33,35,670 అత్యవసర కేసులలో సేవలు అందించాయి. సర్వీస్ యూజర్లలో 23% మంది మహిళలు. ఆ తర్వాత 12% మంది కిడ్నీ సంబంధిత సమస్యలు, 11% మంది రోడ్డు, ఇతర ప్రమాదాలకు గురవుతున్నవారు అంబులెన్స్ సేవలను ఉపయోగించుకుంటున్నారు.